ప్రభుత్వానికి టైం ఇచ్చే ఉద్దేశం జగనన్నకు లేదుట!

చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి.. ప్రజలు తిరస్కరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన మనసులో ఒక గడువు పెట్టుకున్నారట. వారు సరిగ్గా పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నారట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న తరుణంలో- జగనన్నకు ఈ పరిపాలన భయంకరమైన నిరాశను కలిగించినట్లు గా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రభుత్వానికి ఇక సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని,  ఆరు నెలల వరకు ఆగవలసిన అవసరం లేదనిపిస్తోందని.. వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి టైం ఇవ్వకపోవడం అంటే దాని అర్థం ఏమిటో జగన్ కాస్త ప్రజలకు విడమరిచి చెబితే బాగుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 161 సీట్ల తిరుగులేని బలంతో ఐదేళ్లపాటు నిరాటంకంగా పాలించడానికి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. మధ్యలో ఆరు నెలలకు మించి సమయం ఇవ్వడానికి కుదరదు అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఏ అధికారంతో ప్రభుత్వానికి ఇక సమయం ఇవ్వను అని ఆయన అంటున్నారు? ఆయనకు ఏం హక్కు ఉంది? రాజకీయ పార్టీ పెట్టి తాను కూడా ఒక ప్రజా నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నంత మాత్రాన ఆయన నిజమైన ప్రజానేత అవుతారా? రాష్ట్రంలో ప్రజలు 151 సీట్లను అప్పగించి, ప్రభుత్వ అధినేతగా అభివృద్ధి చేసి చూపించమంటే యావత్తు రాష్ట్రాన్ని తీవ్రమైన నిరాశలోకి నిస్పృహలోకి నెట్టిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి! అలాంటి జగన్ ను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఆ విషయం ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వను అంటూ ఎగిరెగిరి పడుతున్నారు.

ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల సమయం ఉండగా, మధ్యలో జగన్ ఇచ్చే సమయంతో పాలకులకు పనేముంటుంది? అయినా వంద రోజుల పరిపాలన పట్ల ఈ వ్యవధిలో తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు, కొత్త పథకాలు, అమరావతి నగర నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు, పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్న తీరు ఇవన్నీ గమనించిన రాష్ట్ర ప్రజలు ముకుమ్మడిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే శాశ్వతంగా అధికారంలోనే ఉండిపోతుందని, తాను మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది కలగా మాత్రమే మిగిలిపోతుందని ఆందోళన చెందుతున్న జగన్మోహన్ రెడ్డి- ఈ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచింది, ప్రజల తరఫున దీక్షలకు కూర్చుంటా లాంటి కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కుయుక్తుల రాజకీయాల వలన పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రజలు ఆయనకు హితబోధ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories