ఈ సీన్ చూస్తే జగన్ ఉడికిపోతాడేమో!

కొన్ని దృశ్యాలను నేరులో తన కళ్లతో చూసి ఓర్చుకోవడం కష్టం కాబట్టే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కాకుండా.. బెంగుళూరు ప్యాలెస్ కు పలాయనం చిత్తగించారా? అంటే  ప్రజల్లో అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాను స్మశానంగా మార్చేయదలచుకున్న అమరావతి ప్రాంతానికి.. కూటమి సర్కారు పాలనలో వైభవస్థితి పడుతుండడం ఆయన ఓర్వలేని సంగతుల్లో అత్యంత ముఖ్యమైనది. అదే విధంగా.. సభావేదిక వద్ద జరిగిన కొన్ని సన్నివేశావలను గమనిస్తే.. అలాంటి జగన్ తన కళ్లతో చూడలేరు అనే అనిపిస్తుంది. ఒకవేళ జగన్ కార్యక్రమానికి హాజరై ఉన్నా కూడా.. ఈ సీన్ చూస్తే.. అప్పటికప్పుడు అక్కడినుంచి పారిపోయి ఉండేవారేమో అని జనం నవ్వుకుంటున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..

సభావేదిక మీదికి నరేంద్రమోడీ వచ్చిన తరువాత.. నాయకులను సరదాగా పలకరించారు. కరచాలనాలు చేశారు. పరిచయాలు చేసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా.. ఆయన మంత్రి నారాలోకేష్  తో కరచాలనం చేస్తూ.. ‘‘నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా?’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో మోడీ పర్యటించినప్పుడు కూడా నారా లోకేష్ తో ఇవే మాటలు అన్నారు. ప్రధాని ప్రశ్నకు లోకేష్ బదులిస్తూ.. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీ వచ్చి కలుస్తానంటూ ఆయనతో చెప్పారు. ఈ సీన్ ను జగన్ చూసిఉంటే తట్టుకోగలిగే వారు కాదేమో అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలవడం అనేది చాలా పెద్ద పని. ఆయనకు ఉండే బిజీ షెడ్యూళ్లలో రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్య నేతలకు కూడా సమయం కేటాయించడం అనేది అపురూపంగా జరుగుతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నో రోజుల ముందుగానే అపాయింట్మెంట్లు తీసుకుని.. ఆ సమయానికి ఢిల్లీ వెళుతూ ఉంటారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్నో పదుల సార్లు ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లిపోయి.. అపాయింట్మెంట్ దొరక్క రెండు మూడురోజుల పాటూ ఖాళీగా తన బసలో కూర్చుని.. ప్రధానిని కలవకుండానే తిరిగివచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్లి.. ఆయన అపాయింట్మెంట్ దొరక్క.. ఏదో నామ్ కే వాస్తే గా కొందరు మంత్రులను కలిసి.. అక్కడితో చేతులు దులుపుకుని వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానితో అపాయింట్మెంట్ కాదు కదా.. వైఎస్ జగన్మోహన్ రెడ్గికి చాలా సందర్భాల్లో హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. ముందు ఓకే చెప్పిన అపాయింట్మెంట్లు కూడా జగన్ ఢిల్లీ వెళ్లిన తర్వాత రద్దయ్యేవి. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కలిసింది కొన్ని సందర్భాలు అయితే.. అపాయింట్మెంట్ దొరక్కుండా అవమాన భారాన్ని మోసిన సందర్భాలు అనేకం.
అలాంటిది.. ప్రధాని స్వయంగా.. నారా లోకేష్ తో.. ‘నీకెన్నిసార్లు చెప్పినా నన్ను కలవడానికి రావా’ అని అనడం చూస్తే పాపం.. జగన్ ఎలా ఓర్చుకోగలరు? బెంగుళూరు ప్యాలెస్ నుంచి ఈ సీను చూసి కుమిలిపోతూ ఉంటారేమో అని జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories