బాబు ఆ పనిచేస్తే జగన్ సిగ్గుపడాల్సిందే!

రాష్ట్రంలోని పేదలను ఆకర్షించడానికి తనకు స్థిరమైన ఓటుబ్యాంకును తయారుచేసుకోవడానికి, బిస్కట్లు విసిరినట్టుగా సంక్షేమపథకాలను అమలుచేస్తే చాలు.. రాష్ట్రానికి ప్రభుత్వాధినేతగా ఇంకేమీ చేయకపోయినా పర్లేదు.. అనేదే అయిదేళ్లపాటూ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన సిద్ధాంతంగా గత పాలన సాగింది. చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులను చేయకపోయినా పర్లేదు.. కనీసం ప్రజలను నిత్యం ఇబ్బంది పెడుతున్న సమస్యల విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి కొంత స్పందించి ఉండాల్సింది. ఆయనకు అలాంటి ఆలోచన లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ అత్యంత దారుణంగా తయారైన సరే జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. రోడ్ల మరమ్మతులపై కనీసం మాత్రం శ్రద్ధ పెట్టలేదు. పెద్ద పెద్ద గోతులు పడిన రోడ్లు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నా సరే ఆయన లో చలనం రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుంది. సంక్రాంతి లోగా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేశా రని పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

రోడ్లు ప్రగతి సూచికలు అంటారు పెద్దలు. రోడ్లు బాగా ఉన్నచోట అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో స్థిరంగా ఉంటుందనేది దీని అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే రోడ్డు నిర్మాణం విషయంలో శ్రద్ధ చూపించే వారు. కానీ ప్రజల జేబుల్లో డబ్బులు పెట్టడం తప్ప ముఖ్యమంత్రిగా తాను మరొక పని చేయాల్సిన అవసరం లేదని స్థిర నిర్ణయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లు బాగుండాలని ఆలోచన ఎన్నడూ చేయలేదు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పార్టీ సొంత ఖర్చలతో రోడ్ల మరమ్మతులకు పూనుకుంటామని పిలుపు ఇచ్చిన సందర్భాలలో మాత్రం హడావుడిగా అర్ధరాత్రి వేళ మరొకరు గా పనులు చేయిస్తూ మొత్తానికి రోడ్ల మరమ్మతులను కూడా ఒక ప్రహసనంగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మధుర మతలపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రోడ్ల పరిస్థితి పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు సంక్రాంతిలోగా ఆ పనులన్నీ పూర్తి చేయాలని డెడ్లైన్ కూడా విధించారు. అవసరమైతే 300 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి అయినా సరే రాష్ట్రంలో రోడ్ల నుండి మరమ్మతు చేయాలని ఆయన ఆదేశిస్తున్నారు. ఈ పని పూర్తయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా పార్టీల తేడా కూడా  ఎంచకుండా ప్రజలు చంద్రబాబు పరిపాలన నెత్తిన పెట్టుకుంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే గోతులు పడ్డ రోడ్లు అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించే అంశమే. రోడ్లు బాగుపడితే ఆ విషయం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల బాగు కోసం పనిచేస్తున్నదని అభిప్రాయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకే రోడ్ల మరమ్మతుల గురించి చంద్రబాబు నాయుడు దృష్టి సారించడం పట్ల ప్రజలందరూ ఆనందిస్తున్నారు. తొందరలోనే మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రోడ్ల మరమ్మతులను పూర్తిచేస్తే గనుక ఐదేళ్లపాటు ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories