వైసీపీ సంస్కారం : అభ్యర్థులకంటే హంతకుడికే అగ్రపూజ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతే..  కేవలం అవినీతిపరులకు, అక్రమార్కులకు, దందాలు చేసేవారికి మాత్రమే కాదు- హంతకులకు కూడా అగ్రపూజ దక్కుతుంది. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులతో సమానంగా, కొండొకచో అభ్యర్థుల కంటె ఎక్కువగా అగ్రపూజ దక్కించుకోగలరు వాళ్లు! ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిణామాలు ఈ సత్యాన్నే నిరూపిస్తున్నాయి. ప్రత్తిపాడులో తెలుగుదేశం మండల నాయకుడు  శెట్టి సత్తిబాబు వైసీపీలో చేరారు. సహజంగానే ఈ సందర్భాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుతో పాటు, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా వచ్చారు. అయితే వారితో పాటు స్థానిక నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబును కూడా కలిపి ఘనంగా సత్కరించడం.. ముగ్గురికీ కలిపి గజమాలను వేసి.. తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూసేవారికి కంపరంగా ఉంది. 

ఎమ్మెల్సీ అనంతబాబు.. దళితుడైన తన డ్రైవరును హత్యచేసి వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో కీలక నిందితుడు. ఈ కేసులో ఆయన అరెస్టు అయి జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతానికి బెయిలు మీద బయటకు వచ్చారు. ఆయనకు బెయిలు దక్కిన సందర్భంలోనే.. హంతకులకు వైసీపీ ఎంత గొప్ప ప్రాధాన్యం ఇస్తుందో అందరికీ కనిపించింది. జగన్మోహన్ రెడ్డి బెయిలు మీద వచ్చినప్పటి ఊరేగింపును గుర్తుకు తెచ్చేలాగా.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటె గొప్పగా.. అనంతబాబు బెయిలుమీద బయటకువస్తే ఊరేగింపు నిర్వహించారు. బీభత్సమైన ర్యాలీ నిర్వహించారు. అప్పటినుంచి వైసీపీ పార్టీ వ్యవహారాల్లో ఆయన హవా ఎప్పటిలాగానే విచ్చలవిడిగా కొనసాగుతోంది. 

ప్రస్తుతం ప్రత్తిపాడు టికెట్ దక్కించుకున్న వరుపుల సుబ్బారావు కూడా అనంత బాబుకు దగ్గరి బంధువే. దీంతో ఇక ఎన్నికల ప్రచార, వ్యూహ బాధ్యతలన్నీ అనంత బాబే చూస్తున్నారు. తెదేపా నాయకుడి చేరిక సందర్భంగా ఒక మీటింగ్ నిర్వహిస్తే ఆ మీటింగులో అనంతబాబును ఇంత ఘనంగా సత్కరించడం గమనార్హం.
సొంత డ్రైవరును, అదికూడా దళితుడిని చంపేస్తే.. అలాంటి నాయకుడి వలన పార్టీకి చేటు జరుగుతుందని భయపడి ఎవరైనా సరే కొన్నాళ్లు దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ తీరే వేరు. హంతకులు, దుర్మార్గులు, అవినీతి పరులు ఎవ్వరైనా సరే.. అధినేతకు దగ్గరి వారైతే చాలు.. వారిని పార్టీ యావత్తూ నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందని ఈ పరిణామాలు చాటి చెబుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories