మాయలు గారడీలు నిండిన జగన్ మేనిఫెస్టో!

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను తాజాగా ప్రకటించారు. అయితే ఏ వర్గానికి కూడా నిర్దిష్టంగా స్పష్టమైన మెరుగైన హామీలు ఏమీ ఆ మేనిఫెస్టోలో లేకపోవడం విశేషం. సాధారణంగా ఏ పార్టీ అయినా సరే.. మేనిఫెస్టో అంటే.. తమ పార్టీని గెలిపిస్తే రాబోయే అయిదేళ్లలో ఏం చేస్తాం.. అనే విషయాలను చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంది. అయితే జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. ‘2019లో ఏం చెప్పాం.. ఈ అయిదేళ్ల పాలనలో ఏం చేశాం..’ అనే విషయాలను చెప్పడానికే 90 శాతానికి పైగా మేనిఫెస్టో పేజీల్లోని స్థలాన్ని ఆయన కేటాయించారు. కొత్తగా ఇచ్చే హామీల గురించి పది శాతం స్పేస్ కూడా ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా గమనిస్తే..

మేనిఫెస్టోలో ప్రతి రంగం గురించి మూడు విభాగాలుగా జగన్ ప్రస్తావించారు. 2019లో చెప్పినవి, అయిదేళ్లలో చేసినవి, రాబోయే అయిదేళ్లలో చేసేవి.. ఇలా ఆ మూడు విభాగాలు ఉన్నాయి. చాలా రంగాలకు సంబంధించి.. రాబోయే మూడేళ్లలో ఏం చేస్తాం అనేది ప్రస్తావన కూడా లేనేలేదు. పించన్లను చంద్రబాబు ఒకవైపు 2024 ఏప్రిల్ నుంచి 4000 చేస్తానని ఘనంగా ప్రకటించగా, జగన్ 2028 నుంచి రెండు విడతల్లో పెంచి 3500 వరకు మాత్రమే పెంచుతాననడం ఆ పార్టీ కార్యకర్తలకే మింగుడుపడడం లేదు.

జగన్ మేనిఫెస్టో లోని విచిత్రమైన అంశం ఏంటంటే.. చాలా పథకాల గురించి సుదీర్ఘంగా వివరించి.. ఆ పథకాలను కొనసాగిస్తాం అనేదే పెద్ద వరంగా ఆయన ప్రకటించారు. ఉన్న పథకాలను కొనసాగించడం కూడా ఒక హామీయేనా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్త హామీలు కాకుండా.. ఉన్న వాటినే మళ్లీ మేనిఫెస్టోలో ప్రచురించడం అనేది జగన్ కు మాత్రమే చెల్లిన విద్య.

మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి అక్కడినుంచి పాలన కొనసాగిస్తాం అని జగన్ అంటున్నారు. నిజానికి ఇది పెద్ద మోసపూరితమైన మాట. రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో పెండింగులో ఉంది. ప్రభుత్వం మళ్లీ ఎన్నికైనంత మాత్రాన ఆ పిటిషన్ విషయంలో గానీ, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పరంగా గానీ ఏమీ తేడా రానేరాదు. సుప్రీంలో తేలితే తప్ప రాజధాని తరలించలేరు. కాగా.. జగన్ మాయ మాటలతో, అబద్ధాలతో, అర్థసత్యాలతో, అసలు హామీలుగా పరిగణించలేని స్వోత్కర్షతో ప్రజలను మభ్యపెట్టేలా ఈ మేనిఫెస్టో రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి.

నుదుటిమీద బ్యాండేజీ మాయం!
ఎవరో ఆకతాయి రాయి విసిరిన నాటినుంచి ఇప్పటిదాకా ఆ చిన్న గాయానికి చాలా పెద్ద బ్యాండేజీతో ప్రతిరోజూ ప్రజల్లో తిరుగుతూ వారి సానుభూతి కోసం తనమీద హత్యాయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గడిపిన జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బ్యాండేజీ లేకుండా కనిపించారు. నిన్నటిదాకా ఏదో ప్రదర్శనకోసం వేసుకున్నట్టుగా తిరుగుతున్నారనే ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories