మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డికి ప్యాలెస్ లు అంటే మహా పిచ్చి అనే సంగతి అందరికీ తెలుసు. ఊరూరా ఒక అత్యద్భుతమైన ప్యాలెస్ ను ఆయన నిర్మింపజేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉన్న ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ వివరాలు కొంతవరకు అందరికీ తెలుసు. కానీ వీటిని తలదన్నే బెంగళూరు ప్యాలెస్ వివరాలు చాలామందికి తెలియదు. కానీ ఆ బెంగళూరు ప్యాలెస్ లో జగన్ ఎక్కువ కాలం ఉండలేదు. ఇప్పుడు ప్రజలు ఘోరంగా ఓడించి తనను ఇంట్లో కూర్చోబెట్టిన తరువాత జగన్ ఆ బెంగళూరు ప్యాలెస్ ముచ్చట కూడా తీర్చుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ లో 15వ తేదీ నుంచి సామాన్య ప్రజలను కలిసి వినతిపత్రాలు స్వీకరించేలా ప్రజాదర్బార్ నిర్వహించాలని అనుకున్న జగన్.. మొదలు కాకముందే దానిని రద్దు చేసుకుని మరీ.. బెంగళూరు ప్యాలెస్ కు తరలివెళ్తున్నారు.
జగన్ కు బెంగళూరు, లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్ లు ఉన్నాయి. జగన్ బెంగళూరులో ఉండేది తక్కువ. నిజానికి ఆయన బెంగళూరు ప్యాలెస్ 23 ఎకరాల జాగాలో విస్తరించి, 60 గదులతో అత్యంత విలాసవంతమైన సదుపాయాలతో ఉంటుందని అంటుంటారు. అందుకే ఆ ప్యాలెస్ ముచ్చట తీర్చుకోవడానికి జగన్ ఓడిపోయిన తర్వాత ఎక్కువ అక్కడే గడపడానికి చూస్తున్నారని అంతా అనుకుంటూన్నారు.
జగన్ విశాఖలో కూడా ఇలాంటి ప్యాలెస్ మీది మోజుతో రుషికొండ ధ్వంసం చేసి ప్రభుత్వ సొమ్ముతో నిర్మించుకున్నారు. ఓటమి కారణంగా అందులో ఒక్క రోజు కూడా బస చేసే యోగ్యత దక్కలేదు. ప్రతి జిల్లాలోనూ పార్టీ ఆఫీసుల పేరిట, రూపాయి లీజుతో ప్రభుత్వ స్థలాలు తీసుకుని, ప్యాలెస్ లను నిర్మించుకునే ప్రయత్నం చేశారు. అవన్నీ వివాదంలో పడ్డాయి. కనీసం ఓడిపోయిన పుణ్యమా అని బెంగళూరు ప్యాలెస్ ముచ్చట తీర్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా ఉంది.