‘మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కిన..’ సామెతలా జగన్!

వెనకటికి పల్లెపట్టుల్లో ఓ మొరటు సామెత చెబుతుంటారు. అలవిగాని గయ్యాళి అయిన ఆడది తానే మొగుణ్ని కొట్టి.. ముందుగా తానే మొగసాలకెక్కి, అంటే రచ్చబండ దగ్గరికెళ్ల.. ‘నా మొగుడు నన్ను కొట్టేశాడో’ అని దొంగ ఏడుపులు ఏడ్చి గోల చేసిందంట- అనేది ఆ సామెత అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరళి అచ్చంగా ఈ సామెత తీరుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే.. కడపజిల్లాలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

వారి జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్. అక్కడ కోర్సు పూర్తిచేసినా కూడా.. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడానికి ప్రధాన కారకుడు జగన్. అలాంటి జగన్ ఇప్పుడు వారికోసం కపటప్రేమను చూపిస్తున్నారు. పైగా.. కూటమి ప్రభుత్వం అక్కడి విద్యార్థుల ఆందోళనను తొలగించడానికి, వారి మేలుకోరి అన్ని రకాల చర్యలు తీసుకుంటే.. తనను చూసి భయపడి ఆ నిర్ణయాలు తీసుకున్నట్టుగా జగన్ ప్రగల్భాలు చెప్పుకుంటున్నాడు. తన ట్వీట్ కు ప్రభుత్వం జడుసుకున్నదని అంటున్నారు. ఆయన అత్యుత్సాహం చూసి జనం నవ్వుకుంటూ ఉండడం విశేషం.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించరేస్తున్న తరహాలో.. తన సొంత జిల్లాలో తన తండ్రి పేరుతో ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించారు. విద్యాసంస్థలను ప్రారంభించడం అనేది కాంట్రాక్టర్లకు నిధులు దోచిపెట్టడం కోసం మాత్రమే అన్నట్టుగా ఈ యూనివర్సిటీని ఆర్భాటంగా ప్రారంభించిన జగన్.. ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి.. ఢిల్లీనుంచి అనుమతులు తీసుకురావడం గురించి మాత్రం పట్టించుకోలేదు. అయిదేళ్లుగా అక్కడ చేరిన విద్యార్థులు మొరపెట్టుకుంటూనే ఉన్నప్పటికీ.. వారి ఆవేదన ఆయన చెవులకు సోకలేదు.

జగన్ పదులసార్లు ఢిల్లీ వెళ్లారు గానీ.. తన జిల్లాలో తాను స్థాపించిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అనుమతుల గురించి కనీసం లేఖ కూడా ఇవ్వలేదు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి బయటపడేయడానికి చూపించిన శ్రద్ధలో ఒక్కశాతం కూడా తన తండ్రిపేరిట ఉన్న యూనివర్సిటీ మీద చూపించలేదు. తీరా ఈ ఏడాది పెద్దసమస్య వచ్చి పడింది. అక్కడ తొలిబ్యాచ్ విద్యార్థుల కోర్సు కూడా పూర్తయింది. అయితే యూనివర్సిటీకే ఢిల్లీలోని సీఓఏ గుర్తింపుల లేకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరం అయింది. జగన్ నిర్లక్ష్యం వలన.. వారికి గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు వస్తాయో లేదో అని భయపడుతూ వారు చాలా వారాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళన కాలంలో జగన్ పలుమార్లు కడప జిల్లాకు వెళ్లినా వారివైపు కూడా చూడలేదు.

వైఎస్ షర్మిల వారిని పరామర్శించి.. జగన్ చేసిన ద్రోహాన్ని కనీసం చంద్రబాబు చక్కదిద్దాలని విజ్ఞప్తి చేసింది. అప్పటికే విద్యార్థుల భవిష్యత్తు గురించి శ్రద్ధ పెట్టిన సర్కారు మొత్తానికి ఈ ఏడాది మెరిట్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు జరగాలని ఆదేశించింది. అయితే.. ఇదంతా తన ప్రతిభ అని జగన్ నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి తాను చేసిన ద్రోహాన్ని చంద్రబాబు సర్కారు సరిదిద్దుతోంటే.. ఇలా చాటుకోవడం అనేది చవకబారుతనంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories