వర్రానే ఏమీ అన్లేక చంద్రబాబుపై ఏడుపులా జగన్!

జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి గురించి, సొంత చెల్లి గురించి ఆయన సొంత పార్టీ కార్యకర్త, ఆయన భార్యకు పీఏ కూడా అయిన పులివెందుల భక్తుడు వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన నీచమైన పోస్టులు సగం రాష్ట్రం చూసింది. సదరు వర్రాను ఏమీ అనడం, తప్పుపట్టడం చేతకాని జగన్మోహన్ రెడ్డి.. జగన్ తల్లిమీద, చెల్లి మీద పోస్టులు పెట్టిన వారిని కూడా వదలిపెట్టం అన్నందుకు చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల గురించి ఆయన తాజా ప్రెస్ మీట్ లో మొసలి కన్నీరు కార్చడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

‘మా కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు.అంత మాత్రాన మా తల్లిని చెల్లిని ప్రస్తావిస్తూ చంద్రబాబునాయుడు మాట్లాడతారా? ఇది సభ్యతేనా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్లున్నారు.. మా ఇంట్లో కూడా ఆడవాళ్లున్నారు..’ అంటూ జగన్మోహన్ రెడ్డి ధర్మపన్నాలు వల్లించారు. అయితే ఆయన మాటల విన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు చెప్పినదెల్లా.. జగన్ తల్లి గురించి, చెల్లి గురించి తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కూడా విడిచిపెట్టం అని మాత్రమే. అలాంటి తప్పుడు వ్యక్తుల గురించి జగన్ మాట్లాడడం లేదు. తల్లిని చెల్లిని ఎంత నీచంగా తిట్టినా సరే ఆయనకు పర్లేదు. కానీ.. అలాంటి తప్పుడు మనుషులను కూడా శిక్షించకుండా వదలిపెట్టేది లేదని చంద్రబాబు అంటే మాత్రం జగన్ కు తప్పుగా కనిపిస్తోంది.

వర్రా రవీందర్ రెడ్డి విషయంలో వైసీపీ నాటకం ఆడుతోంది. వర్రా పోలీసు విచారణలో తన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి ఉన్నారని చెప్పిన తర్వాత, ఐప్యాక్ నుంచి వచ్చే కంటెంట్ నే తాను పోస్టు చేసేవాడిననని చెప్పిన తర్రవాత.. పార్టీ మాట మారుస్తోంది. వర్రా రవీంద్ర రెడ్డితో తమకు సంబంధం లేనది వారు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

ఆ రకంగా అవినాష్ రెడ్డిని కాపాడడానికి, వర్రా రవీందర్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారు వైసీపీ నాయకులు! అయినా సరే.. వర్రా గురించి పల్లెత్తు మాట అనడానికి జగన్ కు నోరు రావడం లేదు. తన తల్లి మీద అసభ్యమైన పోస్టు పెట్టిన , తన తల్లి శీలాన్ని శంకించిన వాడి గురించి విమర్శ చేయడానికి జగన్ ఎందుకు రోషం అనిపించడం లేదో ప్రజలకు అర్థం కావడం లేదు. తన తల్లి శీలం మీద నిందలు వేసిన వారిని వదిలేసి.. చంద్రబాబు మీద పడి జగన్ ఏడవడంలో అర్థం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వైసీపీ నాయకుల మీద వారి మహిళల మీద అసభ్య పోస్టులు వస్తే వాటిమీద కూడా చర్యలుండాలని డిమాండ్ చేయకుండా, జగన్ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రజలంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories