జగన్ భయ చిహ్నం: షర్మిలపైకి ఎగదోలుతున్నారు!

రాజశేఖర రెడ్డి కుంటుంబం పరువును స్వయంగా బజారుకీడ్చి, ఆర్థిక లబ్ధి తప్ప మరొకటి తనకు అక్కర్లేదని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కొత్తగా భయం కూడా మొదలైందా? ఒక వ్యవహారంలో భయపడితే ఎలా స్పందిస్తారో జగన్ ఇప్పుడు అలాగే స్పందిస్తున్నారు. చెల్లెలు తనను మోసం చేసిందని ఆరోపిస్తున్న ఆయన ట్రిబ్యునల్ లో కేసు వేశారు. అంతవరకు బాగానే ఉంది. కోర్టు ఏ సంగతి తేలుస్తుందని ఎదురుచూడాలి. అక్కడ తన మాటే కరెక్టు అని గట్టిగా వాదించడానికి నిపుణులైన లాయర్లను పెట్టుకోవాలి. తాను నెగ్గితే చాలు.. అందరి నోర్లు మూతపడతాయనే వాస్తవాన్ని గ్రహించి.. సంయమనం పాటించాలి.. ఇదీ సహజంగా జరగాల్సిన పద్ధతి.

కానీ.. ఇప్పుడు వ్యవహారం అలా లేదు. ఆయనలో భయం పుట్టింది. కేసు ఏమవుతుందనే సంగతి తరువాత.. ముందుగా వైఎస్ షర్మిల ను ఒక విలన్ గా చిత్రీకరించడం, ఆమెను దుర్మార్గురాలిగా ప్రజల ముందు నిరూపించడం.. షర్మిల ద్వారా చంద్రబాబునాయుడే ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారంటూ అర్థం పర్థంలేని ఆరోపణలో ఆయనమీద బురద చల్లడం ఇప్పుడు జగన్ చేస్తున్న పని. ఆయనలో పుట్టిన భయానికి నిదర్శనం ఏంటంటే.. ఆయన తనొక్కడే మాట్లాడడం లేదు. తన వందిమాగధులు, తైనాతీలు, అనుచరులు, నోరున్న తన పార్టీ నాయకులు అందరితోనూ షర్మిల మీద బురదచల్లించే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ తగాదాలో తనకు అనుకూలంగా  మాట్లాడడానికి ఇంతమందిని  అరువు తెచ్చుకోవడం గమనిస్తేనే ఆయన భయపడుతున్నారని తెలిసిపోతుంది.

ఎవరు ఏం మాట్లాడినప్పటికీ.. జగన్- షర్మిల మధ్య  నడుస్తున్నది కుటుంబ తగాదా. ఆ మర్యాదను షర్మిల ప్రస్తుతానికి పద్ధతిగానే పాటిస్తున్నారు. అన్నయ్య మీద ఆరోపణ చేసినా సరే తానే చేస్తున్నారు. కౌంటర్లు ఇచ్చినా తానే ఇస్తున్నారు. తానే పోరాడుతున్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డి అలా చేయడం లేదు.  ఆయన తనకు అండగా తన పార్టీలో తన ఆశ్రితులందరినీ తెరమీదికి తెస్తున్నారు. నిజం చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస పార్టీ అత్యంత దారుణంగా పరాజయం పాలైన తర్వాత.. చంద్రబాబు పరిపాలన గురించి విమర్శించడానికి కూడా.. ఆయన ఇంతమంది నాయకులను ఒకేసారిగా ఇలా మోహరించినట్టు లేదు.

ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అనే ముద్ర ఉంటే చాలు.. ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి షర్మిలను తిట్టాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆ పార్టీ తరఫున వైవీసుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ల నుంచి.. ఎందుకూ కొరగాని అనాకానీ నాయకులు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి షర్మిలను తిట్టిపోస్తున్నారు. ఆమె చంద్రబాబు కుట్రలో భాగమైందని అంటున్నారు. జగన్ కరపత్రికలో విస్తృత ప్రచారం పొందుతున్నారు.

తన వాదనలో బలం ఉన్నదని షర్మిల నమ్ముతున్నది గనుక, ఆమె తనకు అండగా ఎవ్వరి మద్దతు కోరుకోవడం లేదని.. జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా.. తనకు మద్దతుగా అనేక మందితో మాట్లాడించే, షర్మిలపై బురద చల్లించే ప్రయత్నం చేయడంఅనేది ఆయనలోని భయానికి చిహ్నం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories