పెన్షన్లపై చేతులెత్తేస్తున్న జగన్ సర్కారు!

లబ్ధిదారులను ప్రలోభపెట్టేందుకు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇళ్లకు పంపాలనేది వైసీపీ ప్లాన్. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ రెండు నెలల్లో అలా జరగడానికి వీల్లేదని ఈసీ తేల్చేసింది. ఈ సమయంలో అధికార పార్టీ నాయకుల్లో తప్ప.. దాదాపుగా అన్ని పార్టీల నాయకుల్లోనూ లబ్ధిదారులకు పెన్షన్లను సకాలంలో అందేలా చేయడం ఎలాగా అనే  ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని నాయకులందరూ పట్టించుకుంటున్నారు. యంత్రాంగం స్పందించాలని, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి వైఎస్ షర్మిల కూడా.. సీఎస్ జవహర్ రెడ్డికి ఫోను చేసి.. ఈసీ ఆదేశాల నేపథ్యంలో వృద్ధులు ఎవ్వరికీ పెన్షన్లు అందడంలో ఎలాంటి జాప్యం కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీఎస్ జవహర్ రెడ్డి అందుకు సమాధానం ఇస్తూ.. పెన్షన్ల పంపిణీకి కనీసం పదిరోజుల సమయం పడుతుందని చెప్పడంతో.. షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. రెండు మూడురోజుల్లోగా పెన్షన్ల పంపిణీ మొత్తం పూర్తి కాకుంటే..  మీ ఆఫీసుముందే ఆందోళనకు దిగుతానంటూ సీఎస్ ను ఆమె హెచ్చరించారు. వాలంటీరు వ్యవస్థ లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేరా? ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఏమీ లేనేలేదా? అంటూ షర్మిల ప్రశ్నించడం విశేషం.

అయితే అవ్వలాకు తాతలకు ఒక మనవడిలాగా పెన్షన్లు అందిస్తున్నా అని నిత్యం చెప్పుకుంటూ ఉండే జగన్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ.. ఈ దఫా ఈసీ ఆదేశాలు ఎలా ఉన్నా సరే.. తాను ఎప్పటిలాగా అవ్వతాతలకు ఇవ్వాలనే ఉద్దేశం జగన్ కు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆ పార్టీ నాయకులు ఎవ్వరికీ చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఈసీ ఆదేశాలు ఏదో చంద్రబాబునాయుడే ఇప్పించినట్టుగా ఆయన మీద బురద చల్లడానికి వారు పెడుతున్న శ్రద్ధ.. పెన్షన్లు సకాలంలో అందరికీ అందడానికి సరైన ప్రత్యామ్నాయ మార్గం చూసే కృషి చేయడం లేదు.

మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసీకి, సీఎస్ కు లేఖలు రాశారు. సీపీఐ రామకృష్ణ కూడా ఈసీకి లేఖ రాశారు. షర్మిల ఏకంగా ఆందోళనకు దిగుతా అంటున్నారు. ఇలా అన్ని పార్టీల నాయకులు స్పందిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories