ఇటు జగన్ క్లీన్ చిట్ : అటు రిమాండ్ పొడిగింపు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలునుంచి బయటకు వచ్చేలా లేరు. దళిత యువకుడు ముదునూరి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, అతడితో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించిన కేసులో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆయన రిమాండును ఈ నెల 22 వరకు పొడిగించింది. ఈకేసులో వంశీకి సహకరించిన ప్రధాన నిందితులు  కొందరు ఇంకా పోలీసులకు చిక్కకపోవడం, ఇలాంటి దశలో వంశీ బయటకు వస్తే పరిణామాలు అనేక రకాలుగా మారుతాయనే ప్రచారాలు జరుగుతున్న సమయంలోనే వంశీ కి రిమాండు పొడిగించడం జరిగింది. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాపు, నిర్బంధం  జరిగిన తీరును గమనిస్తే.. వంశీ బయటకు రావడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేయడం జరుగుతందనే పోలీసుల వాదనకే బలం ఉంది. దాంతో వంశీ ఇప్పట్లో జైలునుంచి బయటకు రావడం కష్టమని అర్థమవుతోంది.

ట్విస్టు ఏంటంటే.. మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికరి వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లెకు వెళ్లారు. అక్కడ పరామర్శల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ వారిమీద రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగా వల్లభనేని వంశీ సంగతి కూడా ప్రస్తావించారు. అక్కడ వల్లభనేని వంశీ అమాయకుడని, ఆయనకు కేసులతో ఏమీ సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇస్తున్న సమయంలోనే.. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయన రిమాండును పొడిగించడం జరిగింది.

తమాషా ఏంటంటే.. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి ఘటనలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ లేరని, ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారని, అసలు వంశీ లేనే లేడని ఆ పార్టీ వారే చెప్పినప్పటికీ.. అన్యాయంగా కేసులో ఇరికించి 50 రోజులుగా జైల్లో పెట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. అలా టీడీపీకి చెందిన వ్యక్తితో కోర్టులో అలా తప్పుడు వాంగ్మూలం ఇప్పించడానికే వంశీ అతడిని కిడ్నాపు చేసి, నిర్బంధించడమే ఇప్పుడు పెద్ద కేసుగా మారి ఉన్నదనే సంగతిని జగన్ చాలా కన్వీనియెంట్ గా దాచిపెట్టారు. పైగా వంశీ 50 రోజులుగా జైలులో ఉన్నది సత్యవర్ధన్ కిడ్నాపు కేసులోనే. ఆ కేసులోనే ఆయన ముందు అరెస్టు అయ్యారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే.. వాటిని వక్రీకరించి అసత్యాలు, అర్థ సత్యాలతో వండి వార్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని ప్రజలకు అర్థమవుతోంది. చాలా కేసుల విషయంలో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటో ప్రజలకు సులభంగానే అర్థమవుతుంది. జగన్ తన స్టయిలు వక్రీకరణలతో బుకాయించినంత మాత్రాన ప్రతిసారీ ఎడ్వాంటేజీ దొరకడం సాధ్యం కాదని ఆయన తెలుసుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories