చెవిరెడ్డికి ప్రత్యామ్నాయం చూసుకున్న జగన్

పోలీసులు అరెస్టు చేసిన సమయానికి..  విదేశాలకు పారిపోయే ప్లాన్ తో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని రకాల డ్రామాలైనా ఆడి ఉండవచ్చు గాక. కోర్టు రిమాండు విధించిన తర్వాత పోలీసులు కోర్టు ఉత్తర్వులతో కస్టోడియల్ విచారణకు తీసుకు వెళుతున్నప్పుడు మీడియా మైకులు కనిపించిన వెంటనే చెవిరెడ్డి ఎన్ని రకాలుగా నైనా చిందులు తొక్కి ఉండవచ్చు గాక. గదిలో విచారణ లో భాగంగా పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు, అధికారులనే బెదిరిస్తూ వారి మీద రైలు వేస్తుండవచ్చు గాక. ఏది ఏమైనప్పటికీ దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల సొమ్ములను లంచాలుగా దిగు మింగిన అతిపెద్ద కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఎంత కీలకమైనదో ఆ పార్టీ వారికి చాలా స్పష్టంగా తెలుసు. చెవిరెడ్డిని అడ్డగోలుగా తమ అవినీతి సొమ్ముల తరలింపులకు వాడుకున్న జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మొత్తం ఎంత లోతుగా చెవిరెడ్డి కూరుకుపోయారు అన్నది అందరికంటే వారికే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. బహుశా అందుకే కావచ్చు.. చెవిరెడ్డి ఇప్పట్లో రిమాండ్ నుంచి బయటకు రావడం కుదరదని ఫిక్సయినట్లుగా పార్టీలో నిన్నటిదాకా ఆయన చూస్తుండగా బాధ్యతలను మరొక నాయకుడికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డికి ప్రత్యామ్నాయంగా అనంతపురానికి చెందిన సాంబశివారెడ్డి అనే నాయకుడిని ఎంచుకున్నా రు.


గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు. ఒకటి రెండు వారాలు నెలలు కాదు కదా.. ఏకంగా 16 నెలలపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని వేరొకరి చేతిలో పెట్టడం అంటూ జరగలేదు. కాకపోతే జగన్ జైలులో ఉండడం వలన ఆగిపోయిన ఓదార్పు యాత్రను ఆయన చెల్లలె షర్మిల కొనసాగించారు. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ దూసుకెళ్లారు. ఆ బాణాన్నే తుప్పుపట్టించి చెత్తబుట్టలో పడేసిన జగన్, తాను జైలులో ఉన్న అంత సుదీర్ఘ కాలానికి కూడా మరొక నాయకుడి చేతికి కనీసం తల్లి చేతికి సారథ్య పగ్గాలు అప్పగించలేదు.


అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి రిమాండుకు వెళ్లగానే.. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొక నాయకుడిని చూసుుకున్నారు. చెవిరెడ్డి స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. అలాగే చెవిరెడ్డి చూస్తుండిన పార్టీ అనుబంధ విభాగాలన్నింటి బాధ్యతలను కూడా ఆయన చేతిలోనే పెట్టారు. ఈ పరిణామం చెవిరెడ్డి అభిమానులకు మింగుడుపడడం లేదు. జగనన్న కోసం ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని తప్పుడు పనులు చేసి తమ నాయకుడు ఇవాళ జైలుకు వెళితే.. కనీసం రిమాండు నుంచి వచ్చేవరకు ఆగలేకపోతున్నారా? అక్కడికేదో పార్టీలో కొంపలు మునిగేంత పనులు బిజీ ఉన్నట్టుగా.. అప్పుడే చెవిరెడ్డి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం న్యాయమేనా? ఇది చెవిరెడ్డికి అవమానకరం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ అవమానాన్ని జైలులో ఉంటూ పోలీసులపై చిందులేస్తున్న చెవిరెడ్డి  భాస్కర రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories