ఎట్టకేలకు రాజమహేంద్రవరం జైలుకు జగన్!

వైఎస్ జగన్ కు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. ఆ జైలులో రిమాండులో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జగన్ ములాఖత్ లో కలుస్తారు. మూడున్నర వేల కోట్ల రూపాయల సొమ్ములను అడ్డదారుల్లో కాజేసిన లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన నిందితుల్లో ఒకరిని ములాఖత్ రూపంలో జైలుకు వెళ్లి కలవడం ఇదే మొదటి సారి. కొన్ని నెలలుగా.. జగన్ కు అత్యంత ముఖ్యులు, విశ్వసనీయులు, ఆయన ప్లాన్ చేసిన లిక్కర్ దందాలో ఎంతో కీలకంగా ఉండి వ్యవహారం నడిపించిన వారు అరెస్టు అవుతూనే ఉన్నారు. రిమాండుకు వెళుతూనే ఉన్నారు. లిక్కరు కుంభకోణానికి సంబంధించినంత వరకు అరెస్టు అయిన వారు లోనికి వెళ్లడమే తప్ప.. ఒక్కరికి కూడా ఇప్పటిదాకా బెయిలు రాలేదు. ఇలాటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఈ లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా అరెస్టు అయిన ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించడానికి రాజమహేంద్రవరం జైలుకు వెళుతున్నారు. ఈ విషయాన్ని మంగళవారం నాడు ములాఖత్ లో మిథున్ రెడ్డిని కలిసి వచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ స్వయంగా ప్రకటించారు.

అడ్డగోలు అవినీతి దందాలు సాగించి, చిల్లర వసూళ్లతో వందల కోట్లు దోచుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డిని కూడా జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్.. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి వారి కోసం ఇప్పటిదాకా వెళ్లనేలేదు. జగన్ ప్లాన్ చేసిన లిక్కరు కుంభకోణంలో సహకరించినందుకు, మూడున్నర వేల కోట్ల రూపాయలు దోచుకునే వ్యవహారాన్ని ప్లాన్ చేయడం దగ్గరినుంచి సమస్తం తన కనుసన్నల్లో నడిపించినందుకు .. వీరిని మాత్రం జగన్ ఇప్పటిదాకా పరామర్శించలేదు.

ఈ అసంతృప్తి మిథున్ రెడ్డిలో చాలా తీవ్రంగా ఉన్నట్టు పార్టీలో గుసగుసలున్నాయి. పార్టీ నాయకులు ఎవ్వరు ములాఖత్ కు వెళ్లినా.. ఆయన జగన్ పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్టు తెలుస్లోంది. ఈ నేపథ్యంలోనే జగన్ తన ధర్మవరం పర్యటన తర్వాత.. విశస్వనీయులైన ఇద్దరు నాయకులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెకంట్రామిరెడ్డిలను ములాఖత్ కు పంపారు. తన తరఫున సందేశం చేరవేయడానికే జగన్ వారిని పంపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే.. వారితో కూడా మిథున్ రెడ్డి తన అసంతృప్తి, ఆవేదన చెప్పుకున్నట్టు సమాచారం. ఇక వేరే గత్యంతరంలేక జగన్.. ములాఖత్ కు వెళ్లడానికి ముహుర్తం నిర్ణయించుకున్నారు. 25వ తేదీన ఆయన రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మిథున్ రెడ్డిని కలవనున్నారు. ఈ ఇద్దరి ఆంతరంగిక ములాఖత్ లో జగన్ వెంట వేరే నాయకులు కూడా ఉండకపోవచ్చునని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories