ఆ రెండు ఉద్యమాలు చేసే నైతిక హక్కు జగన్ కు లేదు!

జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఉద్ధరించడానికి పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాస్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, తదితర కీలక నాయకులతో బృఃహత్ సమావేశం నిర్వహించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది అనే ఫీలింగ్ ను పార్టీ నాయకుల్లో నింపడానికి ప్రయత్నించారు. ఈ సమావేశంలో జగన్, జనవరిలో తను జిల్లాల యాత్ర ప్రారంభించేలోగా చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను ప్రకటించారు. ప్రధానంగా మూడు అంశాల మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు, దీక్షలు నిర్వహించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు గానీ.. అందులో రెండు అంశాల గురించి ప్రశ్నించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రం లేదు.. అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

జగన్ చెప్పిన ప్రణాళిక ప్రకారం.. రైతులకు మద్దతు ధర, పెట్టుబడి సాయం రూ.20 వేల ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ల వద్ద ఈనెల 11న దీక్షలు చేయాలని నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉంది. చంద్రబాబునాయుడు 20వేల సాయం అందిస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చి ఆరునెలల్లోగానే ఇవ్వలేదని అడగడం అనుచితమే అయినప్పటికీ.. ఎన్నికల హామీ అమలు కాలేదు గనుక.. ఇలాంటివి కూడా అడగకపోతే అసలే హోదా కూడా లేని ప్రతిపక్షానికి మనుగడ కూడా ఉండదు గనుక.. ఈ అంశం గురించి వారి దీక్షలు సబబే అనుకోవచ్చు. అదే సమయంలో మరో రెండు అంశాలమీద కూడా జగన్ రాష్ట్రవ్యాప్త దీక్షలు ప్లాన్ చేశారు.

పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని ఈనెల 27న అన్ని విద్యుత్తు శాఖ ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద దీక్షలు చేస్తారట. అలాగే ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ విద్యర్థులతో కలిసి కలెక్టరేట్ల వద్ద జనవరి 3న ప్రదర్శన నిర్వహిస్తారట.

ఈ రెండు అంశాల గురించి జగన్ ప్రశ్నించడం అనేది చాలా కామెడీగా  ఉంది. చంద్రబాబునాయుడు.. తనను గెలిపిస్తే అయిదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్తు చార్జీలు పెంచకుండా పరిపలన సాగిస్తానని ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటికీ ఆ మాట మీదనే ఉన్నారు. ఇప్పుడు సర్దుబాటు చార్జల పేరిట రెండు విడతలుగా పెరిగిన భారం అనేది.. కేవలం జగన్ పాలన నాటి పాపాల పుణ్యం అని ప్రజలందరికీ తెలుసు. అప్పటి నిర్ణయాల వల్ల ఇప్పుడు కూడా చార్జీలు పెరిగాయి. ఇక రాబోయే నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రూపాయి కూడా పెంచబోరు. ఈ అంశం జగన్ ఎలా ప్రశ్నిస్తారు. లాగే రీఇంబర్స్ మెంట్ కూడా జగన్ తన పాలనలోనే చివరి విడతల డబ్బులు విడుదల చేయకుండా డ్రామాలు నడిపించారు. తీరా ఇప్పుడు పేరుకున్న బకాయిల కోసం దీక్షల డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories