జగన్ దళం : ఓడిపోయినా సరే.. ఒకందుకు హేపీ!

జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీచేసిన వాళ్లందరూ మళ్లీ గెలవబోతున్నాం.. అధికారంలోకి రాబోతున్నాం.. విచ్చలవిడిగా మన దందాలు కొనసాగబోతున్నాయి అనే అనేక రకాల ఊహల మధ్య ఎన్నికల పర్వంలో బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కనీసం 30 కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలకు పైగా తమ తమ నియోజకవర్గాలను బట్టి రకరకాలుగా ఖర్చు పెట్టారు. ఆ 11 మంది తప్ప మొత్తం 164 మంది సాంతం మునిగిపోయారు. ఇంత దారుణంగా మునిగిపోయినా సరే.. ఒక విషయంలో మాత్రం వారంతా చాలా హేపీ ఫీలవుతున్నారట.

జగనన్న ఓడిపోవడం ఒక రకంగా మంచిదే అయింది. ఇప్పుడు కనీసం ఆయన అపాయంట్మెంట్ దొరుకుతోంది. ఆయన మనతో అయిదు పదినిమిషాలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కాస్త ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని కలవడానికి ఆయన వద్ద టైముంది. ఆయన ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నికై ఉంటే.. మనం ఎమ్మల్యేగా గెలిచినా కూడా ఈ విలువ దక్కేది కాదు. ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు అని అంటున్నారట.

ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తన పార్టీ వారందరితోనూ భేటీ అయ్యారు. గదిలో వారందరినీ గుంపుగా నిల్చోబెట్టి ముచ్చట్లు పెట్టుకున్నారు. తామంతా ఓడిపోయిన ఎమ్మెల్యేలం కదా అనే బాధ కంటే.. వారిలో జగన్ అపాయింట్మెంట్ దొరికింది కదా.. అనే ఆనందం ఎక్కువగా కనిపించిందట.

కాకపోతే ఒక బుల్లి గదిలో తన టేబుల్ కు ఎదురుగా మూడంటే మూడే కుర్చీలు వేసి మిగిలిన ఎమ్మెల్యేలు.. సారీ ఓడిపోయిన వారిని  అందరినీ గుంపుగా నిల్చోబెట్టి జగన్ ముచ్చట్లు చెప్పడం చాలా మందికి నచ్చలేదు. ఎంతగా ఓడిపోయిన పార్టీనే అయినప్పటికీ.. ఎమ్మెల్యే స్థాయి వారికి కనీసం కుర్చీవేసి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది కదా అని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories