జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో లిక్కర్ వ్యాపారాల్లో అసలు రసీదుల్లేని విక్రయాలు, డిజిటల్ అవకాశం లేని విక్రయాలద్వారా ఇబ్బడిముబ్బడిగా ప్రజాధనాన్ని దోచుకున్నారు సరే.. పదవి పోయినప్పుడే ఆయన ఆదాయం మొత్తం పోయినట్టే కదా. ఇప్పుడు కొత్ తలిక్కర్ విధానం అమల్లోకి వచ్చినంత మాత్రాన కొత్తగా ఆయన కోల్పోయేదేం ఉంటుంది? అనే అనుమానం ఎవ్వరికైనా కలగవచ్చు.
కానీ, జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్కచాన్స్ రూపంలో అధికారం దక్కిన వెంటనే.. ఆ అధికారం మళ్లీ కోల్పోయినా సరే.. ఎప్పటికీ తిరుగులేని ఆదాయమార్గాలు ఉండే వ్యవస్థను సెట్ చేసుకున్నారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయన తప్పుడు సంపాదనలకు తయారుచేసుకున్న దొంగమార్గాలకు కూడా దెబ్బపడుతోంది. అవి ఒక్కటొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఇప్పుడు భోరుమని విలపిస్తున్నారు. ఆయన ఏడవడానికి ఏదేదో సాకులు చెబుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. లిక్కర్ పాలసీ పేరుతో పాపులర్ బ్రాండ్లు ఏవీ రాష్ట్రంలో దొరకకుండా చేశారు. పాపులర్ బ్రాండ్ల విషయంలో తమ ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుని తాము దోచుకోవడానికి అవకాశం ఉండదని భయపడ్డారు. అందుకే వాటిని రాష్ట్రంలో దొరకకుండా చేశారు. లోకల్ బ్రాండ్లు మాత్రం అమ్ముతూ వాటి ధరలను విపరీతంగా పెంచేశారు. పరమ చెత్త నాసిరకం మద్యం ఇస్తూ పెద్ద ధరలతో దోచుకున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం అనే హామీతో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఆ మాట నిలబెట్టుకుంది. క్వార్టర్ చీప్ లిక్కర్ 99కే దక్కేలా ఏర్పాటుచేసింది. అయితే లోకల్ బ్రాండ్ల ధరలు తగ్గించడం అనేది జగన్ కు జీర్ణం కావడం లేదు. ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పాయింట్ ఏంటంటే.. దానివలన ఆయన దొంగచాటు ఆదాయం దెబ్బతింటోంది.
‘రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలలో 14 మీ హయాంలో అనుమతులు వచ్చినవే’ అంటూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారు. కానీ.. ట్విస్టు ఇక్కడే ఉంది. బాబు హయాంలో అనుమతులు వచ్చి ఉండొచ్చు. కానీ.. జగన్ గద్దె ఎక్కిన వెంటనే.. ఆయా డిస్టిలరీల యజమానులను బెదిరించి భయపెట్టి అధికారికంగా కొన్ని, అనధికారికంగా కొన్నింటిని వైసీపీ నాయకులే కొనేసినట్టుగా ప్రచారం ఉంది. అంటే ఆ డిస్టిలరీల్లో తయారయ్యే లిక్కరు మాత్రమే ఇన్నాళ్లు అమ్మారు. మొత్తం ప్రజల సొమ్మును వారే దోచుకున్నారు. తీరా ఇప్పుడు ఆ లిక్కరు రేటు తగ్గిస్తే జగన్ కళ్లమ్మట నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బినామీ ఆదాయమే కోల్పోతున్నారు. జగన్ ఇలా మొసలి కన్నీరు కార్చడం మానేసి.. నిర్దిష్టంగా ప్రజాసమస్యలపై పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.