జగన్ బుద్ధి : 11 నియోజకవర్గాలకు శాపం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సంకుచిత మనస్తత్వం, కురచబుద్ధి రాష్ట్రంలో ఏకంగా 11 నియోజకవర్గాలకు శాపంగా మారుతున్నాయి. 11 నియోజకవర్గాల ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేంత వరకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా సభకు వెళ్లవద్దని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం వలన, ఆ నియోజకవర్గాలకు చెందిన సమస్యలు ఏవీ శాసనసభలో ప్రస్తావనకు వచ్చే అవకాశమే లేదు. దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కుంటుపడుతుంది. వెరసి జగన్ బుద్ధి ప్రగతి నిరోధకం అవుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకుచితమైన బుద్ధి పట్ల ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమావేశం నిర్వహించిన జగన్ వారికి తేల్చిచెప్పారు. మామూలు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు రెండు నిమిషాలు మైక్ ఇస్తానంటే ప్రజా సమస్యలను ఏం చెప్పగలను?  అంటూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా ఆయన పట్టించుకోలేదు.

ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.. అని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినప్పుడు జగన్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. మనం శాశ్వతంగా వెళ్లం అని చెప్పడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇచ్చాక వెళ్దాం అని జగన్ అంటున్నారు గానీ.. అది ఈ అయిదేళ్లలో జరిగేది కాదని  ఆయనకు కూడా తెలుసు అని సొంత ఎమ్మెల్యేలే అనుకుంటున్నారు.
సభకు ఒకసారి వెళదాం.. వెళ్లిన తర్వాత కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడు అసెంబ్లీకి రాబోము అని ప్రకటించడం బాగుంటుంది- అని కొందరు సీనియర్లు జగన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దానికి కూడా అసహనంగా ‘వాళ్లూ ఎటూ  మైక్ ఇవ్వరు.. అంతదానికి వెళ్లడం ఎందుకు?’ అంటూ జగన్ విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది.

ఒకవైపు సభకు వెళ్లకపోతే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేయాలని.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేస్తున్నారు. జగన్ మాత్రం తన సంకుచిత బుద్ధులను మార్చుకుని ప్రజల కోసం ఎమ్మెల్యేగా బాధ్యతగా ఉండాలనే సంగతిని మర్చిపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories