వాలంటీర్లను బురిడీ కొట్టించే జగన్ వరం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం వాలంటీర్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంక్షేమము, పథకాలు లాంటి మాటలన్నీ ఉత్త ట్రాష్.. వాలంటీర్లను మభ్యపెట్టడం, వారిద్వారా లబ్ధిదార్లను మభ్యపెట్టడం అంతిమంగా ప్రజలు ఆ మాయంలో ఉండగానే వారితో ఓట్లు వేయించుకోవడం, నెగ్గడం అనేదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్న రూట్ మ్యాప్ అని అర్థం అవుతోంది. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లను లోబరచుకోవడానికి వారికి అభ్యర్థులు భారీగా నగదు ముట్టజెబుతున్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను మాయచేసేలా ఒక దొంగ హామీని ప్రకటించారు. తను మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. వాలంటీరు వ్యవస్థను పునరుద్ధరించడం కోసమే తాను సీఎంగా తొలిసంతకం చేస్తానని జగన్ ప్రకటించారు. ఈ మాట ద్వారా వారందరినీ బురిడీ కొట్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

వాలంటీర్లు అనే వ్యవస్థ పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. అంతే తప్ప వారిని ఉద్యోగాలనుంచి తొలగించాలని చెప్పలేదు. ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందిగా చెప్పలేదు. కానీ.. వైసీపీ వారు మాత్రం.. చంద్రబాబు మీద బురద చల్లడానికి ఈసీ ఆదేశాలను రకరకాలుగా వక్రీకరించారు. చంద్రబాబు కారణంగా వాలంటీరు వ్యవస్థ రద్దు అయిపోయిందని కూడా అన్నారు. కానీ.. ఇప్పటిదాకా వాలంటీరు వ్యవస్థను రద్దు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. వారిని పింఛను పంపిణీ విధులకు దూరంగా పెట్టినంత మాత్రాన వారికి వచ్చేనెల జీతాలు ఇవ్వాల్సిందే. అలాగే మే 13 నాటికి పోలింగు పూర్తియపోతుంది కాబట్టి.. జూన్ 1 న పంపిణీచేసే పింఛన్లు వాలంటీర్ల చేతులమీదుగానే ఇవ్వడానికి అవకాశం ఉంది.

అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. వాలంటీర్లు వ్యవస్థ ఇప్పటికే రద్దయిపోయిందనే సంకేతాలు పంపుతున్నట్టుగా.. తాను మళ్లీ అధికారంలోకి రాగానే.. వాలంటీరు వ్యవస్థను పునరుద్ధరించడానికే తొలిసంతకం పెడతానని అంటున్నారు. ఇంతకూ జగన్ ఆ వ్యవస్థను రద్దు చేసేయాలని, ఆ బురద చంద్రబాబు మీద వేయాలని కుట్ర పన్నుతున్నారా? అనే అనుమానాలు కొత్తగా కలుగుతున్నాయి. ఇప్పటికీ వాలంటీర్లతో రాజీనామాలు చేయించి.. ఈ రెండు నెలల పాటు వారి వేతనాలు తామే ఇస్తూ ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని, వారిని పోలింగ్ ఏజంట్లుగా వాడుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు వార్తలున్నాయి. రాజీనామాలు చేసినా సరే.. వారిని పోలింగ్ ఏజంట్లుగా అనుమతించకూడదని సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి లేఖ కూడా రాశారు. దానితో భయపడిన జగన్, ఇలాంటి తలనొప్పులేమీ లేకుండా.. వాలంటీరు వ్యవస్థను రద్దు చేసేస్తే రెండు లాభాలుంటాయని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకటి- ఆ పాపం చంద్రబాబు మీద నెట్టేయవచ్చు. రెండు- వారిని నిరభ్యంతరంగా ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్ ఏజంట్లుగానూ వాడుకోవచ్చు… అలా చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories