జగన్ ఆశ ఢమాల్ : చంద్రన్నకు అవ్వతాతల నీరాజనం!

‘నా అవ్వ తాతలు, నా అక్క చెల్లెమ్మలు..’ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా కామెడీ చేశారు. ‘నా వితంతువులు..’ అనే మాట ఒక్కటే ఆయన వాడలేదు. డబ్బులు పంచిపెడుతున్నాను గనుక.. వాళ్లంతా తనకు మళ్లీ కిరీటం పెడతారని జగన్ అనుకున్నారు. చంద్రబాబునాయుడు పెన్షన్లను రూ.4వేలు చేస్తానని ప్రకటించిన తర్వాత.. ఖంగుతిన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరు అనే ప్రచారం ప్రారంభించారు. కానీ జగన్ ఆశలు ఢమాల్ అయ్యాయి. జగన్ మాటలనే ఎవ్వరూ నమ్మలేదు. చంద్రబాబును తిరుగులేని మెజారిటీతో గెలిపించారు. పెన్షన్ల విషయంలో చంద్రబాబు ఆలస్యం చేస్తే మళ్లీ ఆడిపోసుకోవచ్చునని జగన్ ఎదురుచూశారు. కానీ చంద్రబాబునాయుడు.. తాను సీఎం కుర్చీలో కూర్చుని అధికారం చేపట్టిన రోజునే.. మూడో సంతకంగా పెన్షన్ల ఫలు మీద సంతకం పెట్టి జగన్ కు ఆశాభంగం కలిగించారు.

మొదటి సంతకంగా మెగా డీఎస్సీ ఫైలుమీద, రెండోదిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం చేస్తానని చంద్రబాబునాయుడు ముందుగానే ప్రకటించారు. మూడో సంతకం పెన్షన్ల ఫైలు మీద పెట్టడం ద్వారా.. ఆ అంశానికి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో చంద్రబాబునాయుడు చెప్పకనే చెప్పారు. దీంతో రాష్ట్రంలోని అవ్వతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరూ చంద్రబాబునాయుడుకు నీరాజనం పడుతున్నారు. ప్రజలకు ఏ వాగ్దానం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వంద రకాల మీనమేషాలు లెక్కించారో.. చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోవడం అసాధ్యం, అంత డబ్బు ప్రభుత్వానికి సమకూరదు అని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారో అవన్నీ గల్లంతయాపోయాయి. చంద్రబాబు కేవలం నాలుగువేలు చేయడం మాత్రమే కాదు. చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేనివిధంగా వికలాంగులకు మూడువేలుగా ఉన్న పెన్షనును ఒకేసారి 6వేలకు పెంచారు. నిజానికి ఇదొక అద్భుతం అనే చెప్పాలి. ఆ పెన్షను కూడా 4 వేలు చేసి ఉన్నా సరే.. చంద్రబాబుకు గొప్ప కీర్తే దక్కేది కానీ.. ఆయన ఏకంగా 6వేలు చేయడం ఔదార్యానికి నిదర్శనం. తీవ్ర అనారోగ్యాలకు గురైన వారికి అందే 5వేల పెన్సనును 15వేలు చేశారు. అలాగే కిడ్నీ వ్యాధఇగ్రస్తులకు 5వేలను 10వేలకు పెంచారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం పొందిన వారికి కూడా రూ.6వేలు ఇస్తారు. ఇవన్నీ పెంచడం మాత్రమే కాదు.. అన్ని పెన్షన్లను ఏప్రిల్ నుంచి లెక్కకట్టి అరియర్స్ సహా జులై 1వ తేదీన ఇళ్ల వద్దనే అందించడానికి చంద్రబాబు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. అందుకే జగన్ ఆశలు భంగపడ్డాయి. ప్రజలు, లబ్ధిదారులు అంతా  చంద్రబాబుకు నీరాజనాలు పడుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories