జాక్’ ట్రైలర్.. సాలిడ్ ఎలిమెంట్స్ తో..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “జాక్”. మొదటి నుంచి మంచి బజ్ ని రేపిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మాత్రం సాలిడ్ ఎలిమెంట్స్ తో అదిరింది అని చెప్పవచ్చు.

ఒక మిషన్ పై స్పై గా సిద్ధూ కనిపిస్తుండగా తనతో పాటుగా అదే మిషన్ పై ప్రకాష్ రాజ్ కూడా కనిపించడం వారి నడుమ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ సహా వైష్ణవి చైతన్యతో సిద్ధూ ట్రాక్ ఇంకా సిద్ధూ కామెడీ టైమింగ్ గా మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో ప్రామిసింగ్ గా ఈ ట్రైలర్ కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ లో కెమెరా వర్క్ మరియు సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. వీటితో పాటుగా మేకర్స్ నిర్మాణ విలువలు కూడా ఎక్కడా తగ్గకుండా ట్రైలర్ కనిపిస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఏప్రిల్ 10న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories