జాబిలమ్మ జాకెట్టెసుకొచ్చెనండి..జరగండి..జరగండి!

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి బుధవారం జరగండి ..జరగండి అనే పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే జాబిలమ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జరగండి..జరగండి…పార‌డైసు పావ‌డేసుకొచ్చెనండి..’ అనే పాటను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది.

రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా కియారా అద్వానీ కథానాయికగా… ఫుల్ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా గా గేమ్‌ ఛేంజర్‌ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండగా… అనంత్‌ శ్రీరామ్‌ జరగండి…పాటకు లిరిక్స్‌ అందించారు. ఈ పాటను చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా 150 థియేటర్లలో ఈ సాంగ్‌ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories