ఇట్స్ టైమ్ టు ప్రభాస్! నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగానే కాకుండా ఓటిటిలో కూడా సాలిడ్ హిట్ టాక్ షో “అన్ స్టాప్పబుల్” తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఇప్పుడు వరకు నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంటూ వస్తుంది. అయితే ఈసారి నాలుగో సీజన్ రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో సాగుతుండగా తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో స్పెషల్ ఎపిసోడ్ ని మేకర్స్ విడుదల చేశారు. అయితే లాస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలయ్య షోలో పాల్గొనగా రామ్ చరణ్ తో ఫోన్ కాల్ మాట్లాడినపుడు తనని ఎలా బుక్ చేసాడో అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఈసారి చరణ్ షోకి వెళ్ళాడు ఇపుడు ప్రభాస్ టర్న్ వచ్చింది. దీంతో ఈ ఎపిసోడ్ లో కూడా ఇద్దరి మధ్య హైలైట్ ఫోన్ కాల్ ఉంటుందని తెగ వైరల్ అవుతుంది. లాస్ట్ టైం ఒరేయ్ చరణు… అంటూ ప్రభాస్ మాట్లాడితే ఈసారి ఓయ్ డార్లింగు.. అంటూ రామ్ చరణ్ రియాక్షన్ ఉండనుందని ఓ టాక్ వినపడుతుంది. మరి ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ఎపిసోడ్ ని మేకర్స్ ఈ జనవరి 8 సాయంత్రం 7 గంటలకి స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నారు