తాడేపల్లిలో ఉండడానికి మొహం చెల్లడం లేదు మరి!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతానికి తాడేపల్లి ప్యాలెస్ ను వీడి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లారు. మామూలుగా వీకెండ్ విలాసాలకోసం కదా.. ప్రతివారం యలహంక ప్యాలెస్ కు పయనం అవుతుంటారు. వీక్ డేస్ లో వీలైనంత వరకు తాడేపల్లి లో ఉంటూ.. వివిధ కేటగిరీల కింద కొందరు పార్టీ నాయకులను పిలిపించి వారితో మీటింగులు పెట్టుకుంటూ.. చంద్రబాబు మీద నిందలు వేయడానికి సిద్ధం చేసుకున్న ఒక్కటే స్క్రిప్టును ప్రతి ఒక్కరికీ చదివి వినిపిస్తూ కాలం గడుపుతూ ఉంటారు కదా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. కానీ.. ఈ సారి మాత్రం నాలుగురోజులు ముందుగానే బయల్దేరేశారు. ఎందుకలగ? ఎందుకంత అర్జెంటుగా ఆయన బెంగుళూరు వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు ఏమైనా రాచకార్యాలు గానీ, రాజకీయ కార్యకలాపాలు గానీ పెండింగులో ఉన్నాయా? అనే అనుమానం ఎవరికైనా కలగడం సహజం. కానీ. విశ్వసనీయంగా తెలుస్తున్నదేంటంటే.. తాను ఏ ప్రజల స్వప్నాని అయితే దారుణంగా చిదిమేయాలని అనుకున్నారో.. అదే అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయబోతుండగా.. ఎంతో ఘనంగా వైభవంగా జరగబోతున్న ఆ కార్యక్రమాన్ని తన కళ్లతో చూసి ఓర్వలేక, ప్రధాని కార్యక్రమానికి హాజరు కావడానికి మొహం చెల్లక.. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని వీడి బెంగుళూరు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నందున.. ఎటూ ప్రతిపక్ష నాయకుడిగా అధికారిక హోదా లేదు. కాకపోతే మాజీ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ మర్యాదలు మాత్రం ఉంటాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రోటోకాల్ మర్యాదలను విస్మరించలేదు. రాష్ట్రప్రభుత్వం తరఫున.. రాజధాని పనులకోసం.. ప్రధాని చేతులమీదుగా.. శంకుస్థాపన జరుగుతుండగా.. అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారితో ఆహ్వానపత్రికను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి పంపింది. అయితే ఆ సమయానికి జగన్ తాడేపల్లి ఇంట్లో లేరు. విషయం ఏంటంటే.. అప్పటికే ఆయన బెంగుళూరు వెళ్లిపోయారు.

వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా గెలిచారు గానీ.. శాసనసభకు వచ్చి తన ప్రాథమిక బాధ్యత కూడా నిర్వర్తించడం లేదు. అలాంటి వ్యక్తి తాను అపరిమితంగా ద్వేషించిన అమరావతి నగర పనులు ప్రారంభం అవుతుండగా.. ఈసారి తనకు గ్రహణంలాగా పట్టి వాటిని అడ్డుకునే అవకాశం కూడా లేదని స్పష్టంగా తెలిసినప్పుడు.. ఆ కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఉండడానికి కూడా ఆయనకు మొహం చెల్లలేదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి మాత్రం పనులు ప్రారంభం అయిన తర్వాత.. మూడేళ్లలోగా నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అదే జరిగితే.. మూడేళ్లకు మళ్లీ సీఎం అవుతానని విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి.. అలా అయినా కూడా ఆ నగరాన్ని విధ్వంసం దిశగా నడిపించడం ఆయన చేతుల్లో ఉండదు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి ముందే బెంగుళూరు వెళ్లిపోయారని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories