జగన్ తో అంట కాగిన పాపానికి విముక్తి ఈజీ కాదు!

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులను కూడబెట్టుకోవడానికి విచ్చలవిడిగా క్విడ్ ప్రోకో వ్యవహారాలకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో జగన్ కు మేలు చేసినందుకు ఆయనతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు తమ మీద సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కింది కోర్టులో విచారణను తేల్చుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. గతంలో కూడా ఒకసారి హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, సీబీఐ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఆదేశాలు తెచ్చుకోవడంతో హైకోర్టు మళ్ళీ విచారించింది. తాజాగా వాన్ పిక్ వినతిని తిరస్కరించింది. ఈ తీర్పును లోతుగా గమనిస్తే దాదాపు రెండు దశాబ్దాల కిందట జగన్మోహన్ రెడ్డితో అంట కాగి, ఆయన అక్రమాస్తులను కూడబెట్టుకోవడానికి తమ వంతు సహకారం అందించిన పాపానికి అంత తొందరగా నిష్కృతి లభించేలా లేదని మనకు అర్థమవుతుంది.

2012లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ కు అనేక ప్రయోజనాలు కల్పించింది. ఇందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకోగా నిగ్గుతేలింది. 2012లో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా 2021 వరకు తమకు విముక్తి కల్పించాలని వాన్ పిక్ కేసు వేయలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఇలాంటి పిటిషన్ వేసి కేసును కొట్టేయాలని పోరాటం ప్రారంభించింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాసెస్ మొదలు పెట్టడం గమనార్హం. 2022 జులైలో ఈ కేసును కొట్టి వేస్తూ వాన్ పిక్ అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై సిబిఐ సుప్రీంకోర్టులో ఆపీలు చేయగా, కేసు పూర్వాపరాలను మళ్ళీ విచారించి తీర్పు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు- హైకోర్టుకు సూచించింది. ఆ తర్వాత మంగళవారం వాన్ పిక్ ప్రతికూలంగా తీర్పు వచ్చింది.
ఈ తీర్పు పర్యవసానంగా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తన మీద ఉన్న అన్ని ఆరోపణలకు సంబంధించి విచారణని ఎదుర్కొని తీరాల్సిందే. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు భావించింది. జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసే పాపాలలో ఒకసారి భాగం పంచుకుంటే.. ఆ పాపాలు జీవితాంతం వెన్నాడుతూనే ఉంటాయని ఈ దృష్టాంతం నిరూపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories