స్టార్ హీరో కమల్ తాజాగా నటించిన సినిమా భారతీయుడు 2. ఈ సినిమా పై దర్శకుడు శంకర్ చాలా హైప్స్ క్రియేట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది సినిమా గురించి బహిరంగంగానే మాట్లాడారు అంటే దాని రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు.
గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం అవ్వడమే కాకుండా.. శంకర్ ఓల్డ్ స్కూల్ ఆలోచనలపై భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయుడు- 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా భారతీయుడు- 3 సినిమాని మరో ఆరు నెలలలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా దెబ్బకు ఆ మూడో భాగాన్ని ఇప్పట్లో విడుదల చేయడం లేదని సమాచారం.
శంకర్ రీ వర్క్ చేసి ఆ చిత్రాన్ని మెరుగుపరచడానికి లైకా ప్రొడక్షన్స్ “భారతీయుడు 3” విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ “భారతీయుడు 2”, “భారతీయుడు 3” రెండు కూడా ఒకేసారి చిత్రీకరించిన సంగతి తెలిసిందే. “భారతీయుడు 3″ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. రెండవ భాగం విజయవంతమైతే.. మూడవ భాగంపై క్రేజ్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు, ఇది పూర్తిగా మారి పోయింది. అయితే భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 బాగుంటుందని కమల్ హాసన్ ముందు నుంచి చెబుతు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మూడవ భాగం ఆకట్టుకునేలా రివర్టింగ్‌గా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.