హే సీతా… అంటూ వచ్చి కుర్రకారు గుండెల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలోనూ చెరగని ముద్ర వేసుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని ..తరువాత సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. సీతారామం సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న అనే సినిమాలో నటించింది.
ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ క్రమంలో తాజాగా మృణాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు మృణాలు ఏం అందంటే.. తాను కంటినిండా నిద్ర పోయి చాలా రోజులైందని చెప్పుకొచ్చింది ఈ భామ.ప్రస్తుతం మృణాల్ వెకేషన్ లో ఉంది. వరుస షూటింగ్స్ తో లైఫ్ బిజీగా మారిపోవడంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఖాళీ లేకుండా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ కుటుంబంతో గడిపే క్షణాలు చాలా అవసరమని మృణాలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు షూటింగ్ నుంచి విరామ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు వివరించింది.