నాలో అందరికీ అది ఓ వింత!

నిత్యా మీనన్ మంచి నటి. ఏ కాలంలోనైనా తమ నటనతో ఆకట్టుకునే హీరోయిన్స్ లో చాలా కొంచెం మంది మాత్రమే ఉంటారు. ఇక ఈ దశాబ్దంలో వచ్చిన హీరోయిన్స్ ను చూసుకుంటే అతి తక్కువమంది మాత్రమే, తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కల్పించుకోగలిగిన హీరోయిన్స్ లో నిత్యామీనన్ కూడా ఒకరు. అలాంటి నిత్యామీనన్‌ తన పై ఎన్నో విమర్శలు వచ్చాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా చేస్తున్నప్పుడు కొందరు ‘‘ఈ జుట్టు ఏమిటి ? ఇది చాలా వింతగా ఉంది’’ అని అన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఈ రింగుల జుట్టునే ఇష్టపడతారు. కానీ ఆ రోజుల్లో ఇది అందరికీ ఓ వింత. పైగా, మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి. నా పై ఎన్ని విమర్శలు వచ్చినా నాలాగే ఉండి నేనెంటో నిరూపించుకోవాలనుకున్నా. నా దృష్టిలో శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడమనేది సరియైన ఆలోచన కాదు’ అని నిత్యామీనన్ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories