పాపం ముద్రగడ.. వాడుకోవడంలేదని దిగులు!

వర్తమాన రాజకీయాల్లో సిద్ధాంతాలు అనే పదానికి నిర్వచనం తెలిసిన వ్యక్తులు అసలు ఉండరు. కేవలం అవకాశ వాదులు మాత్రమే ఉంటారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని బట్టి, లేదా, తమ గతిలేనితనాన్ని బట్టి మాత్రమే వారు ఏదో ఒక పార్టీలో కొనసాగుతూ ఉంటారు. ఫలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని తెలిసి, ఆ పార్టీలో దూరి టికెట్లు దక్కించుకోవడానికి అవకాశం ఉంటే.. తమ సిద్ధాంతం కోసం వేరే పార్టీలో కొనసాగేవారు నూటికో కోటికో ఒకరు ఉంటే ఎక్కువ. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు జనసేనలో చేరితో తెలుగుదేశంతో కలిసిన కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మి ముందు వారితో బేరాలు మాట్లాడుకున్నా కాపునేత ముద్రగడ పద్మనాభం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. వైసీపీ గెలుస్తుందని ఆయన నమ్మి ఉండవచ్చు. ఆయన నమ్మకం ఆయన ఇష్టం. అయితే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తనను సరిగా వాడుకోవడం లేదని ఆయన దిగులుపడిపోతున్నారట.

గోదావరి జిల్లాల్లోని తన స్వగ్రామం నుంచి రెండువేల కార్లతో తాడేపల్లికి వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని ముద్రగడ అనుకున్నారు. అయితే.. అంత ఓవరాక్షన్ వద్దని తాడేపల్లి వర్గాల నుంచి మొట్టికాయ పడిన తర్వాత.. తన కొడుకుతో మాత్రం కలిసి, గుట్టుచప్పుడు కాకుండా తాడేపల్లి వచ్చి కండువా కప్పించుకుని.. జగన్ ను కీర్తించి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా ఆయన వైసీపీ మళ్లీ గెలుస్తుందని అంటూనే.. జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడానికి కూడా సిద్ధం అని ప్రకటించారు. తాను ఏ పదవీ కోరుకోవడం లేదని అంటూనే.. జగన్ ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని ఆశను బయటపెట్టారు. నిజానికి ఆయన కాపు కులస్తుల్ని కూడగట్టడానికి రాష్ట్రమంతా తనను తిప్పుతారని ఆశించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా చేసిన సేవలకు రాజ్యసభ సభ్యత్వం అడగవచ్చునని ప్లాన్ చేసుకున్నారు. కానీ జగన్ ఆయనను పార్టీలో చేర్చుకుని పక్కన పెట్టేశారు. ఇంటికే పరిమితం చేశారు. ఒక్కఊరిలో ప్రచారానికి కూడా పిలవలేదు. కనీసం ఆ ప్రాంతంలో సిద్ధం సభలు నిర్వహించినప్పుడు వేదికమీదికి కూడా రానివ్వలేదు.

ముద్రగడ వల్ల కాపు ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారుతాయి అనే భావనే ఆయనకు రాకుండా చేసేశారు. తనను జగన్ ఫుల్లుగా వాడుకుంటే.. అప్పుడు తాను ఏదైనా పదవులు అడగడానికి అవకాశం ఉంటుంది గానీ.. తనను వాడుకోకపోతే ఏం పదవులు అడగగలడు? అదే ఆయన దిగులు? ఆ పార్టీ గెలిచినా ఓడినా తనకు దక్కేదేం ఉండదు అని భయపడుతున్నట్టున్నారు. అందుకే ముద్రగడ పద్మనాభం తనను ప్రచారానికి కించిత్తు వాడుకోకపోయినా.. తానే ప్రెస్ మీట్లు పెడుతూ.. పార్టీకోసం ఏదో పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికరి చంద్రబాబును, పవన్ తిడుతూ గడుపుతున్నారు. ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూస్తే జాలి కలుగుతున్నదని కాపు నాయకులే అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories