వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూస్తే అయ్యోపాపం అనిపిస్తోంది. నిన్నటిదాకా ఆ పార్టీలో జగన్ ప్రాపకం కోసం ఆయన చల్లటిచూపుల్లో పడడం కోసం నాయకులు కొట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఫోన్లు వస్తే కూడా స్పందించడం లేదు. పరిస్థితి చాలా చిత్రంగా మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. పోటీచేయడానికి టికెట్ ఇస్తాం.. అంటే తీసుకునే దిక్కులేదు. పైగా, ఖర్చులకు డబ్బులు ఎంత ఇస్తారు? అని అడిగే వాతావరణం కనిపిస్తోంది.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం జగన్మోహన్ రెడ్డి తలరాతను అచ్చంగా తిరగరాసేసింది. ఆ పరాజయం తరువాత.. ఉమ్మడివిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వస్తే దాని గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. అది వారు ఖచ్చితంగా గెలిచే సీటు అని తెలిసినా.. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ పదవి ఏం చేసుకోవడానికి అని ఎవరూ ముందుకు రాలేదు. జగన్ బలవంతంగా బొత్సకు కట్టబెట్టారు. ఆయన గెలిచారు. ఫ్లోర్ లీడర్ కూడా అయ్యారు.
ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు రెండు ఎమ్మెల్సీ పట్టభద్రస్థానాలకు ఎణ్నికలు జరగబోతున్నాయి. నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన ఆలపాటి రాజాకు ఒక చాన్స్ ఇచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖర్ కు ఇచ్చారు.వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉంది. సీటు ఇస్తామన్నా కూడా ఎవరూ తీసుకోవడం లేదు. ఇంతటి దయనీయ పరిస్థితి వచ్చేసిందే అని అందరూ జాలిపడుతున్నారు.