అది నోలన్ సినిమా.. ఏడాదికి ముందే టికెట్లు విడుదల!

హాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్టైల్‌తో ప్రేక్షకులను మైండ్‌బ్లాక్ చేసే డైరెక్టర్ అంటే క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పాలి. తన సినిమాలు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లు, అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో ఉండటమే కాదు, ప్రతి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా సినిమా కూడా అదే స్థాయిలో హైప్‌ని క్రియేట్ చేస్తోంది.

నోలన్ సాధారణంగా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా పేరు “ఒడిస్సి”. ఈ మూవీపై ఇప్పటినుంచే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హైప్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్‌కి ఒకటి రెండు నెలల ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ నోలన్ సినిమా కోసం మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్‌లో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ ఏకంగా ఒక సంవత్సరం ముందుగానే స్టార్ట్ చేశారు. ఐమ్యాక్స్ వారు దీనిని అధికారికంగా ప్రకటించడంతో ఈ మూవీపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఈ భారీ అంచనాల మధ్య, “ఒడిస్సి” వచ్చే ఏడాది జూలై 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. నోలన్ మైండ్‌బ్లోయింగ్ సినిమాలను ఎప్పుడూ మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఇప్పుడు నుంచే ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు. ఈ నిర్ణయం తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories