చెల్లెమ్మ జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్!

జగన్మోహన్ రెడ్డి చాలా చాలా విషయాల్లో నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా ఉంటారు. తన మీద విమర్శలు వచ్చినా సరే స్పందించారు. ఖండించరు. అసలు తనకేమీ అంటనట్టుగా కనిపిస్తారు. అలాంటిది ఆయన తన చెల్లెమ్మ షర్మిల విషయంలో ఆ కంట్రోల్ పాటించలేకపోతున్నారు. పర్యవసానంగా చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. షర్మిల విమర్శలకు ఆయన కౌంటర్ ఇస్తే.. దానికి సమాధానంగా షర్మిల మరింత ఘోరంగా రెచ్చిపోతున్నారు. జగన్ ను తీవ్రమైన, ఎవ్వరూ కూడా కాదనలేని విమర్శలతో నిందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు చెల్లెమ్మ షర్మిల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని, ఆమెను కెలికే కొద్దీ.. మరింతగా భ్రష్టుపడుతున్నారని సొంత పార్టీ వారే అభిప్రాయపడుతుండడం విశేషం.

జగన్ అవమానభఆరంతో అసెంబ్లీకి ఎగ్గొట్టి బయటే తిరుగుతుండడాన్ని చాలామంది లాగా షర్మిల కూడా తప్పుపట్టారు. అయితే.. షర్మిలను బద్నాం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి తెలిసిన మార్గం ఒకే ఒక్కటి. ఆమె చంద్రబాబు స్కెచ్ మేరకు ఆయనకు అనుకూలంగా కనిపిస్తోందని మాట్లాడడం. అంతకు మించి ఆయన షర్మిల మీద మరో నింద వేయడానికి ఆయనకు దారి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఈసారి కూడా జగన్ ప్రతివిమర్శలు చేశారు. వాటికి తిరుగుజవాబుగా షర్మిలా ఎక్స్ వేదికగా చాలా ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం.

‘‘వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్టుగా కనిపిస్తోందా?’’ అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.
‘సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది. మాకు అలాంటి ద్వేషం లేదుగానీ.. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తా.. అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నా.. అందుకే రాజీనామా చేయాలని డిమాడ్ చేస్తున్నా’ అని షర్మిల చెప్పుకొచ్చారు.

నిజానికి అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేనప్పుడు రాజీనామా చేయడం బెటర్ అనే మాట అనేక వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ప్రోటోకాల్  లేకుండా బతకలేని జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేస్తారో లేదో చూడాలి. మరోవైపు అహంకారమే మీ పతనానికి కారణం అంటూ షర్మిల అన్నయ్యను ఘాటుగా విమర్శిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories