అలా పెట్టడం తప్పు!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో  వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. ప్రీమియర్ షోల నుంచి మిక్డ్స్ టాక్ నే అందుకుంది.

అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.. ”గుంటూరు కారం’ సినిమా మాకు బాగా నచ్చింది. కంటెంట్ పరంగా ఆ మూవీలో ఎలాంటి తప్పూ లేదు. అలాగే, సినిమా కమర్షియల్‌గా కూడా బానే విజయాన్ని అందుకుంది.

కానీ, ఒక్క నైజాంలోనే కలెక్షన్స్ పరంగా గండిపడింది. ఆ మూవీకి ‘గుంటూరు కారం’ అని టైటిల్ పెట్డడం ఓ తప్పు అని నేను భావిస్తున్నా. ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ పెట్టడం, పైగా మిడ్ నైట్ 1 AM షో వేయడం కూడా తప్పు అయిపోయింది’ అని నిర్మాత నాగవంశీ అన్నారు.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories