చంద్రబాబును అప్పట్లో పెద్దిరెడ్డి చెప్పుతో కొట్టారంట!

చంద్రబాబునాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య విద్యార్థి వర్గ రాజకీయ తగాదాలు ఉన్నాయి. ఇద్దరూ రెండు గ్రూపుల్లో ఉన్నారు. ఆ గ్రూపుల మధ్య తగాదాలు ఉన్నాయి. అంతవరకు నిజం.

కానీ.. ఆ తగాదా గురించి ఇవాళ ఆ తగాదాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నీచమైన వక్రీకరణలు చేస్తున్నారంటే.. ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.. కాలేజీకి యూనివర్సిటీకి కూడా తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పెద్దిరెడ్డి , చంద్రబాబును చెప్పుతో కొట్టారని, అలా కొట్టినందుకు చంద్రబాబు కక్ష కట్టారని అంటున్నారు. అందువల్ల చంద్రబాబునాయుడు ఆయన మీద కక్ష కట్టి, ఆయన కొడుకు మీద కక్ష తీర్చుకోవాలని అనుకున్నారట. ఎలాగో ఒకలాగా  మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు లిక్కర్ కేసులో ఇరికించారంటే.. తలాతోకా లేకుండా ఇలా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది… అని ప్రజలు అనుకుంటున్నారు.

పెద్దిరెడ్డి – చంద్రబాబు మధ్య యూనివర్సిటీ రోజుల్లో విభేదాలు ఉన్నమాట నిజం. కానీ అవి పరస్పరం తలపడి కొట్టుకునే వరకు కూడా వెళ్లలేదు. కానీ.. కొట్లాటలు కూడా జరిగినట్టుగా.. ఏకంగా చెప్పుతో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన సొంత భాష్యం చెబుతున్నారు. అప్పట్లో తాను దగ్గరుండి అదంతా చూసినట్టు చెబుతున్నారు.
ఒకవేళ ఆయన చెబుతున్నది నిజమే అనుకుందాం. కానీ జగన్ ముడిపెడుతున్న తీరులో కనీస లాజిక్ ఉందా అనేది మాత్రం సందేహమే. ఆయన చెబుతున్న మాటల్లోనే అనేక డౌట్లు పుడుతున్నాయి.

1.పెద్దిరెడ్డి ఆ పని చేసి ఉంటే గనుక.. చంద్రబాబునాయుడు తన పగ తీర్చుకోవడానికి ఇన్ని దశాబ్దాలు ఎందుకు నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దిరెడ్డి మంత్రిగా తప్ప మరో పదవి వెలగబెట్టింది లేదు. పగ తీర్చుకునే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే గనుక.. ముఖ్యమంత్రిగా ఇదివరకు ఉన్న పద్నాలుగేళ్ల కాలంలో ఎందుకు పెద్దిరెడ్డి జోలికి వెళ్లలేదు.

2. పెద్దిరెడ్డి ఇప్పటికంటె గతంలో ఇంకా బలహీనమైన నాయకుడిగానే ఉన్నారు. వైఎస్ వచ్చిన తర్వాత.. ఆయన అక్రమార్జనలు, సంపాదనలు, విలువ కొంత పెరిగింది. అంతకుముందే తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పెద్దిరెడ్డిని పట్టించుకోలేదు కదా?

3. పెద్దిరెడ్డి తన పట్ల దుడుకు గా వ్యవహరించి ఉంటే.. ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టినంత మాత్రాన చంద్రబాబునాయుడు పగ ఎలా చల్లారుతుంది. పెద్దిరెడ్డినే జైల్లో పెట్టాలి కదా? గత పద్నాలుగేళ్లలోనూ అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు కద.

4. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళ్లగానే.. తండ్రి మీద ఉన్న కక్ష కారణం అంటూ జగన్ బుర్రతక్కువ లాజిక్కులు లాగుతున్నారు. స్వయంగా రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరిగిన మరో వేలకోట్ల వ్యవహారం ఇసుక కుంభకోణంలోఇంకా పూర్తిగా లెక్కలు తేలలేదు. అదంతా తేలిన తర్వాత రామచంద్రారెడ్డి కూడా జైలుకు వెళ్లక తప్పదు. మరి అప్పుడు ఎవరి మీద కక్ష గురించి ఆ పనిచేశారని ఆపాదించాలనుకుంటున్నారో ఇప్పుడే ఆయన స్కెచ్ తయారుచేసుకుంటే మంచిదని జనం ఎద్దేవా చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories