ఇది కదా.. గౌరవప్రదమైన ప్రతీకారం అంటే..!!

ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనేది సామెత. ఆ సామెతకు ప్రతిరూపం అన్నట్టుగా.. ఎక్కడైతే అవమానాల పాలయ్యారో.. ఎక్కడైతే వేదను అనుభవించారో.. ఎక్కడైతే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల దురహంకారానికి బలయ్యారో.. సరిగ్గా అదే స్థలంలో ఇప్పుడు వారు సముచితమైన గౌరవం పొందారు. ఆనాడు అధికారం తమ చేతిలో ఉన్నది కదాని.. దుర్మార్గంగా వ్యవహరించిన వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు.. పసుపు చొక్కాలు విప్పించి అవమానించిన చోటులేనే.. ఇవాళ శాలువాలు కప్పించుకుని సముచిత సత్కారాలు పొంది.. గౌరవప్రదంగా, సగర్వంగా మళ్లీ సైకిలు యాత్రను ప్రారంభించారు. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ దుర్మార్గాల్ని ధిక్కరించిన ఎపిసోడ్ మాత్రమే కాదు.
 
వివరాల్లోకి వెళితే..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కాలంలో చంద్రబాబునాయుడును అత్యంత దుర్మార్గంగా అరెస్టు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కర్నూలు జిల్లా యాత్రలో ఉంటూ.. రాత్రివేళ తన బస్సులో నిద్రిస్తున్న చంద్రబాబును అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. మొత్తానికి అరెస్టుచేసి, అత్యంత కిరాతకంగా రోడ్డుమార్గంలో తరలించి 55 రోజుల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబునాయుడు అరెస్టు పట్ల అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రజలు అభిమానులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు, శాంతియుతమైన నిరసన దీక్షలు చేపట్టారు. అలాంటి నిరసనల్లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువగ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్రవ్యాప్త సైకిలు యాత్ర చేపట్టారు. తమ స్వగ్రామం నుంచి కుప్పం వరకు సైకిలు  యాత్రలో భాగంగా వెళుతుండగా.. పుంగనూరు వద్దకు వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడం జరిగింది.

అక్కడి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుదు, రౌడీషీటరు చెంగలాపురం సూరి, తన అనుచరులతో కలిసి వారిని అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలతో, పసుపు చొక్కాలు ధరించి వారు సైకిలు యాత్ర చేస్తుండగా 2023 అక్టోబరు 20న పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద వారిని అడ్డుకొని, చొక్కాలు విప్పించి అవమానించి పంపారు.

సరిగ్గా అదే సుగాలిమిట్ట వద్ద.. ఆనాడు అవమానాలు పొందిన కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులు సత్కారం చేశారు. వారు చాలా  ఘనంగా అక్కడినుంచి కడపలో జరుగుతున్న మహానాడు వేదికవరకు సైకిలు యాత్రగా బయలుదేరి వెళ్లారు. ఎక్కడైతే అవమానాలు పొందారో.. అక్కడే సత్కారాలు పొందడమే.. వైసీపీ వారి దుర్మార్గానికి సముచితమైన ప్రతీకారం అని అందరూ ఇప్పుడు వారిని అభినందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories