ఇది కదా శ్రద్ధ.. ఇది కదా చిత్తశుద్ధి!

రాష్ట్రంలోని వృద్ధులకు, వితంతువులుకు, ఒంటరి మహిళలు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఉంది. ఏ పెన్షన్ల విషయంలో అయితే.. నారా చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తాడని.. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి కుటిల ప్రచారం చేశారో.. అదే పెన్షన్ల విషయంలో మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాదు.. తమ సంకల్పం ఎంత బలమైనదో చంద్రబాబు నిరూపించుకోబోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి తాను పరిపాలించినంత కాలమూ ఏడాదికి 250 వంతు పించను పెంచడం మాత్రమే కాదు.. నా అవ్వ తాతలు, నా అక్కచెల్లెమ్మలు అని మాయమాటలు చెబుతూ వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. ప్రత్యేకించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మూడు నెలల కాలంలో వారిని ఎన్ని యాతనలు పెట్టారో అందరూ గమనించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ ఆదేశిస్తే.. వారిని సచివాలయాలకు రప్పించడం ద్వారా, బ్యాంకుల చుట్టూ తిప్పించడం ద్వారా పదుల సంఖ్యలో వారి ప్రాణాలను బలి తీసుకున్నారు. వాలంటీర్లను మూడునెలలపాటు పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలు వచ్చిన నాటినుంచి చంద్రబాబునాయుడు చేస్తున్న సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. వేల సంఖ్యలో ఉన్న సచివాలయ, రెవెన్యూ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవచ్చునంటే పాలకులు చెవిన వేసుకోలేదు. చంద్రబాబు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ భక్తుడైన ఆయన.. జగన్ కుట్రల మేరకే పనిచేశారు. వృద్ధుల ప్రాణాలు పోవడంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు అదే సచివాలయ ఉద్యోగుల ద్వారా.. పెన్షన్ల పంపిణీ చేయిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఒకటో తేదీ సోమవారం ఉదయం 6 గంటలనుంచే పెన్షన్ల పంపిణీ ఇళ్ల వద్దనే జరిగేలా ప్రారంభం కావాలని ఆయన ఆదేశించారు. అదేరోజున పూర్తి కావాలని, ఏమైనా తేడా వచ్చినా కనీసం 90 శాతం పూర్తిచేసి మిగిలినది 2వ తేదీ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు వీలుగా శనివారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసి పెట్టుకోవాలని కూడా ఆదేశించారు. ఏవైనా సాంకేతిక కారణాలవల్ల బ్యాంకులనుంచి డబ్బు విత్ డ్రా చేయడం శనివారం సాయంత్రంలోగా సాధ్యం కాకపోతే.. బ్యాంకులు కూడా ఆదివారం పనిచేసి సొమ్ము ఇవ్వాల్సి ఉంటుందని చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించడం విశేషం. ప్రభుత్వంలో చిత్తశుద్ధి, శ్రద్ధ అంటే ఎలా ఉంటుందో ఈ పనుల ద్వారా వీరు నిరూపిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు సర్కారు అంకిత భావాన్ని గమనించి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories