అబద్ధాల ప్రచారం దైవద్రోహం కాదా.. భూమనా?

దేవుడిని తన రాజకీయ లబ్ధి కోసం ఒక టూల్ లాగా వాడుకుంటే అది దైవద్రోహం అవుతుందని భూమన కరుణాకర్ రెడ్డికి తెలియదా? ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నట్లుగా.. మూడుసార్లు టీటీడీ బోర్డు సభ్యుడుగాను, రెండుసార్లు బోర్డు చైర్మన్ గాను పనిచేసిన భూమనకు, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వాడుకోకూడదనే కనీస నైతిక స్పృహ లేకుండా పోయిందా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలలో కలుగుతున్నాయి. శిల్పుల క్వార్టర్స్ సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో నిరుపయోగమైన ఒక విగ్రహం పడి ఉన్నందుకు.. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ద్రోహం చేసినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద బురద చల్లడానికి భూమన కరుణాకర రెడ్డి చేస్తున్న కుటిల ప్రయత్నం ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. భగవదనుగ్రహం, భగవద్భక్తి లాంటి పదాలను విరివిగా వాడే భూమన కరుణాకర్ రెడ్డి దేవుడి పట్ల ఏమాత్రమైనా విశ్వాసం ఉండే వ్యక్తి అయితే కనుక- ఇలా నీచమైన అబద్ధపు తప్పుడు ప్రచారాలకు దిగకుండా ఉంటారని ప్రజలు భావిస్తున్నారు.

తిరుపతిలో అలిపిరి వద్ద శిల్పుల క్వార్టర్స్ కు సమీపంలో ఉండే ఖాళీ జాగాలో ఒక విగ్రహం నిరుపయోగంగా చాలా కాలం నుంచి ఉంది. నిజానికి ఆ విగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్న రోజులలో కూడా అక్కడే ఉంది. రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగే ముందు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉంటూ రకరకాల స్వార్థ దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. అయితే హఠాత్తుగా ఆ విగ్రహాన్ని నిన్ననే తీసుకొచ్చి అక్కడ పారేసినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు ఒక సరికొత్త డ్రామా ప్రారంభించారు.

టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్న ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు శిల్పులకు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చారని, ఆ తర్వాత అతను దానిని తీసుకెళ్లకపోవడం వలన అక్కడ ఉండిపోయిందని తెలుస్తోంది. అయితే శనీశ్వరుడి విగ్రహానికి విల్లు బాణాలు ఉండాలి తప్ప శంఖచక్రాలు ఎందుకు ఉంటాయని.. అది సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు విగ్రహమే అయి ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి తన ఊహాగానాలతో ను ముడిపెట్టి, బురద చల్లడానికి ఉపక్రమిస్తున్నారు. సాధారణంగా విగ్రహాన్ని చెక్కే క్రమంలో అది దెబ్బతింటే కూడా ఆ పాడైన విగ్రహాన్ని నిరుపయోగంగా వదిలేయడం మామూలే.

వాస్తవాలేమీ విచారించకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఒక విగ్రహం అక్కడ ఉన్నట్లుగా తనకు వేగులు సమాచారం తెచ్చి ఇచ్చారు కనుక.. మురిసిపోతూ టీటీడీ మీద నిందలకు పూనుకోవడం నీచంగా ఉందని ప్రజలు అంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రవర్తన నీతి బాహ్యంగా ఉన్నదని అంటున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణలో ఉండే గోశాలలో ప్రతిరోజు ఆవులు చచ్చిపోతున్నట్లుగా ఎలాగైతే తప్పుడు ఫోటోలతో దుష్ప్రచారం సాగించారో.. ఇప్పుడు కూడా అదే తరహాలో భూమన కరుణాకర్ రెడ్డి ఒక అబద్ధంతో టీటీడీని బదనాం చేయడానికి దిగజారుతున్నారని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories