ఏంటి ఇది నిజమా?

జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా,  రష్మికా  హీరోయిన్ గా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో దుమ్ము లేపుతుండగా సినిమాకి హిట్ టాక్ తో పాటుగా చాలా ప్రశ్నలని సుకుమార్ అలా వదిలేసారు అనే టాక్ కూడా ఆడియెన్స్ లో నడుస్తుంది.

అయితే వీటిలో మళయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్ రోల్ ఎంత పవర్ఫుల్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే పుష్ప 2 లో తన రోల్ ని ముందు మరణించినట్లుగా చూపించారు కానీ మళ్ళీ చివరిలో ముఖం కనిపించకుండా కాలిన చేతితో ఒకరు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇది అతనే అని కొంతమంది వాదిస్తుంటే లేదు షెకావత్ చనిపోయాడు అంటూ కొందరు అంటున్నారు.

మరి ఈ కీలక అంశంపై ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటపడింది. పుష్ప 2 సినిమాలో సండ్ర చెక్కల బ్లాస్ట్ లో కాలిపోతున్న షెకావత్ ని బయటకి తీసుకొచ్చి కాపాడిన ఓ విజువల్ అయితే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో పుష్ప 2 లో ఈ సీన్ తీసేసారు అని కామెంట్స్ వినపడుతున్నాయి. సో షెకావత్ సార్ బతికే ఉన్నారు అంటూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories