టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా సినిమాల్లో తన 12వ మూవీ కూడా ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా ఈ సినిమా పై తాజాగా నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చారు.
ప్రెజెంట్ కొనసాగుతున్న ట్రెండ్ లోనే ఈ సినిమాకి కూడా సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇపుడు ప్రకటించారు. ఆల్రెడీ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక అది కూడా గౌతమ్ లాంటి దర్శకుని నుంచి సీక్వెల్ అంటే మినిమమ్ అంచనాలు కన్ఫార్మ్ చేసుకోవచ్చు. మరి ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 28న విడుదలకు తీసుకుని రానున్నారు.