రాజాసాబ్‌ లో సంజయ్‌ పాత్ర ఇదేనా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో ది రాజా సాబ్‌ ఒకటి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఉన్న గ్రాండ్ కాస్ట్ లో బాలీవుడ్  నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సంజయ్‌ రోల్‌ కి సంబంధించిన ఆసక్తికర సమాచారం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.  సినిమాని మారుతీ ఓ హారర్ డ్రామాగా రూపొందిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ ఓ ఆత్మగా కనిపిస్తారంట. అంతేకాకుండా ఆయన ప్రభాస్ కి తాతగా కనిపించనున్నాడని ఆయన  ఆత్మగా వచ్చాక రాజా సాబ్ జీవితం ఎలా మారుతుంది అనేది ఆసక్తికరంగా మారుతీ ప్రెజెంట్ చేయనున్నారని వినికిడి.

ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Related Posts

Comments

spot_img

Recent Stories