కుబేరలో నాగ్‌ పాత్ర ఇదేనా..క్లారిటీ వచ్చేసినట్లేనా!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తన బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొంత కాలంగా ఆయన నటించి విడుదల చేసిన సినిమాలన్ని కూడా మంచి హిట్లను అందుకున్నాయి. త్వరలోనే ధనుష్‌ కుబేర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫ్యామిలీ డైరెక్టర్‌ గా పేరున్న శేఖర్ కమ్ముల…మొదటి సారి మాస్‌ అండ్‌ యాక్షన్‌ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో కింగ్‌ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పైగా పూర్తి చేసుకుంది. భారీ స్థాయి, భారీ బడ్జెట్‌ తో  సినిమాను తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున పాత్ర ఈ సినిమాలో చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఆయన  పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించి చాలా కాలం అయ్యింది. మరి కుబేరలో నాగ్‌ను ఎలా చూపిస్తారో వేచి చూడాల్సిందే.

 ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా గురించి సంచలన విషయాలను బయట పెట్టారు నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది .ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. యంగ్, మధ్య వయసు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories