యానిమేషన్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పాపులారిటీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. జపాన్ నుంచి వచ్చిన ‘డీమన్ స్లేయర్ : ఇన్ఫినిటీ క్యాసిల్’ ఇప్పుడు హైదరాబాద్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రసాద్ ఐమాక్స్ వద్దనే ఇప్పటివరకు 18 వేలకుపైగా టికెట్లు బుక్ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా యానిమేషన్ సినిమాలకు ఇంతటి క్రేజ్ రావడం అరుదే. ముఖ్యంగా జపనీస్ మూవీకి ఇంత రేంజ్ రెస్పాన్స్ రావడం ప్రత్యేకం. ఈ మూవీని చూడాలని అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.