అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందా?

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడ్ని థానేలో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు. అయితే నిందితుడి గురించి పోలీసులు చేసిన వాదనలు షాక్‌కు గురిచేశాయి. సైఫ్ అలీఖాన్‌పై దాడి అంతర్జాతీయ కుట్రలో భాగమేనని పోలీసులు కోర్టుకు తెలపడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

మరోవైపు విచారణ సందర్భంగా కూడా న్యాయమూర్తి కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని తెలిపారు. ఇక నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ బంగ్లాదేశ్‌కు చెందినవాడు అని, పైగా నిందితుడు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నిందితుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, నటుడిపై దాడి చేసి, మరో ఇద్దరిని గాయపరిచాడని… నిందితుడి వద్ద ఒక కత్తి కూడా దొరికింది.

అతను ఆ రోజు ధరించిన దుస్తులను కూడా దాచిపెట్టాడని… అతను బంగ్లాదేశ్ జాతీయుడు అని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడికి 14 రోజుల కస్టడీ కావాలి” అని పోలీసులు తరపున లాయర్లు కోరారు.

Related Posts

Comments

spot_img

Recent Stories