టాలీవుడ్ జక్కన్న రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రాజమౌళి.. ఆఫ్రికా దేశాల్లో లొకేషన్లను కూడా చూసేసినట్లు తెలుస్తుంది.. కాగా ఏప్రిల్ మూడో వారం తర్వాత ఈ సినిమా రెగ్యలర్ షూటింగ్ కి వెళ్తుందని టాక్ నడుస్తుంది. ఆ దిశగా రాజమౌళి అండ్ కో పనిచేస్తోందని సమాచారం. జనవరి నుంచి వర్క్ షాపులు మొదలు పెడతారంట.
అన్నట్టు ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందనే టాక్ అయితే నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి సినిమా బృందం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కించిందని , అందుకే అడ్వంచర్ థ్రిల్లర్ గా రాబోతుందని తెలిపారు.