టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి కూడా ఒకటి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో వేగంగా సాగుతోంది.
ఓ టాక్ ప్రకారం ఈ సినిమాలో పవన్ వారసుడు అకీరానందన్ కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫైర్ స్టార్మ్ పాటలో కొన్ని షాట్స్ చూసి అభిమానులు అకీరాకి సరిపోయేలా ఉన్నాయని భావించారు. దీంతో సినిమాలో మెగా క్యామియో ఉందని, అది అకీరానే కావచ్చని ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది.
ఇంకా ఓజిలో పవన్ మూడు వేర్వేరు వయసు దశల్లో కనిపిస్తారని, అందులో యంగ్ స్టేజ్ కూడా ఉంటుందని ఇంతకుముందు ఒక నటుడు చెప్పిన విషయం తెలిసిందే. ఆ యంగ్ రోల్ కోసం అకీరాని తెరపైకి తీసుకొస్తే థియేటర్స్‌లో హంగామా ఖాయం అని అభిమానులు అంటున్నారు.