వెట్రిమారన్‌ తో సినిమా నిజమా?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ మూవీ  “దేవర” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తమిళ్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఇందులో తారక్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ మాత్రం ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

కోలీవుడ్ లో తన డెబ్యూ కోసం మాట్లాడుతూ తాను డైరెక్టర్  వెట్రిమారన్ తో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. దీంతో ఈ క్రేజీ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరి కాంబో పై  గతంలో కూడా పలు రూమర్స్ వినిపించాయి. అలాగే ఇప్పుడు ఎలాగో తారక్ కూడా అదే దర్శకుడుతో సినిమాపై మాట్లాడ్డం కొంత అభిప్రాయాలకు తెరలేపుతుంది.

సో వెట్రిమారన్ తో సినిమా ఉంటుంది అనేది దాదాపు నిజమే అని కన్ఫార్మ్‌ అయిపోయింది. వెట్రి లాంటి రా అండ్ రస్టిక్ దర్శకుడుకి తారక్ లాంటి పెర్ఫామర్ దొరికితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ కాంబో భవిష్యత్తులో ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories