ఇప్పటి ఇండియన్ సినిమాలలో అందరికి ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి “స్పిరిట్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రసిద్ధ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్-వరల్డ్ ఆడియన్స్‌కి అనుకూలంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రభాస్ షెడ్యూల్స్ ఇంకా ఫైనల్ కాలేదు.
ఇక సినిమాకు సంబంధించిన రూమర్స్ ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలక పాత్రలో ఉంటారని చెబుతున్నారు మొదట ఇది కేవలం అసత్యమేనని భావించగా, ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం అది నిజమే. చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇంత వరకు అధికారిక నిర్ధారణ రాలేదే అయినప్పటికీ, ఈ కాంబినేషన్ నిజమైతే ప్రేక్షకుల కోసం నిజంగా ఉత్సాహం పుట్టించే విషయం అవుతుంది.