డేట్‌ లాక్‌ అయ్యిందా!

టాలీవుడ్ లో ఉన్నటువంటి యువ హీరోస్ లో అక్కినేని వారి డైనమిక్ కిడ్ అఖిల్ అక్కినేని కూడా ఒకరు. మరి అఖిల్ హీరోగా చేసిన ఇన్ని సినిమాల్లో కూడా ఒక్క సినిమా మినహా సరైన హిట్ లేనప్పటికీ తన నెక్స్ట్ సినిమా వస్తుంది అంటే డెఫినెట్ గా సాలిడ్ బజ్ ఇంకా బిజినెస్ లు ఆ సినిమాకి కనిపిస్తాయి. బహుశా అక్కినేని ఫ్యామిలీ లో ప్రస్తుతం ఈ రేంజ్ లో అఖిల్ కి మాత్రమే ఈ తరహా ఫీట్ సాధ్యం అయ్యింది అని చెప్పాలి.

తన లాస్ట్ చిత్రం ఏజెంట్ తర్వాత మళ్ళీ తన కెరీర్ 6వ సినిమా పట్ల మంచి సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ అయినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఈ ఏప్రిల్ 8 అఖిల్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఈ ట్రీట్ ని ఫ్యాన్స్ కి అందిస్తారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories