బాలయ్యతో ఆ యంగ్‌ హీరో జతకడుతున్నాడా?

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబోలో  ‘అఖండ 2’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఐతే, స్క్రిప్ట్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటుల పై కొత్తగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటించబోతున్నాడంట.

దర్శకుడు బోయపాటి శ్రీను, విశ్వక్ సేన్ కోసం ఓ స్పెషల్ రోల్ రాశాడని.. సెకండ్ హాఫ్ లో ‘విశ్వక్ సేన్’ పాత్ర వస్తోందని సమాచారం. బాలయ్యకి విశ్వక్ సేన్ సన్నిహితంగా ఉంటాడు. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. సినిమా పై అంచనాలు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో  సినిమా సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. అన్నట్టు ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories