అందుకే ఒకే చెప్పలేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.1719 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇక ఈ సినిమాను డైరెక్టర్‌ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

అయితే, ఈ సినిమా స్టార్ట్ కాకముందు అల్లు అర్జున్ ఓ డైరెక్టర్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు బాగా వినిపించాయి. తమిళంలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అట్లీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సినిమా సక్సెస్ తర్వాత తన వద్ద ఓ కథని అల్లు అర్జున్‌కు వినిపించాడట ఈ డైరెక్టర్. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌పై బన్నీ ఇంట్రెస్ట్ పెట్టలేదు.

కాగా, అట్లీ తాజాగా కథను అందించి ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘బేబీ జాన్’ విడుదలైంది. ఈ సినిమా గతంలో అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ సినిమాకి  రీమేక్. కానీ, ‘బేబీ జాన్’ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఫెయిల్యూర్ దిశగా వెళ్తుందని బిటౌన్ వర్గాలు అంటున్నాయి. దీంతో అట్లీ చెప్పిన కథకు అల్లు అర్జున్‌ నో చెప్పడం నిజంగా మంచిదయ్యిందని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories