విజయ్‌ సినిమా డైరెక్ట్‌ ఓటీటీ అందుకేనా!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం “కింగ్డమ్” చివరకు తన విడుదల తేదీని ఖరారు చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ కొత్త లుక్, గౌతమ్ తిన్ననూరి స్టైల్‌ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తితో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయిన వెంటనే, హిందీ వెర్షన్ విషయంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ముందు నుంచి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేసినా, తాజా సమాచారం ప్రకారం హిందీ వర్షన్ మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుందని తెలిసింది.

దీనికి కారణాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాలో ఆలస్యం జరగడం, అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన డీల్స్ వల్ల మేకర్స్ హిందీ వెర్షన్‌ను థియేటర్లకు కాకుండా ఓటీటీకి మళ్లించారని టాక్. సో, తెలుగు, తమిళ ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో ఆస్వాదించగలుగుతారు కానీ హిందీ ఆడియన్స్ మాత్రం ఓటీటీలోనే వీక్షించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయం సినిమా వ్యాపారపరంగానో, మార్కెట్ స్ట్రాటజీ పరంగానో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా, “కింగ్డమ్” రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ పడడంతో, ఇప్పుడు సినిమాపై మళ్లీ హైప్ పెరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories